టెంప‌ర్ లో క‌రీనా కూతురే హీరోయిన్..


అదేంటి.. క‌రీనా క‌పూర్ కు హీరోయిన్ అయ్యేంత కూతురు ఎక్క‌డుంది అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇప్పుడు ఇదే నిజం. కరీనా కూతురే ఇప్పుడు టెంప‌ర్ హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అంటే క‌రీనా కూతురు అంటే సైఫ్ కూతురు అని అర్థం. సైఫ్ మొద‌టి భార్య కూతురు సారా అలీఖాన్ టెంప‌ర్ రీమేక్ సింబాలో హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది. టెంప‌ర్.. ఎన్టీఆర్ కెరీర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా టెంప‌ర్ ది మాత్రం ప్ర‌త్యేక స్థానం. ఆ సినిమాను అలా ప‌క్క‌న కుర్చీ వేసి కూర్చోబెట్టాలంతే. ఎందుకంటే ఎన్టీఆర్ లో ఎంత పెద్ద న‌టుడు ఉన్నాడో ప్ర‌పంచానికి తెలియ‌జేసిన సినిమా అది. అంతేకాదు.. ఆ సినిమాతోనే త‌న కెరీర్ మారిపోయిందంటాడు ఎన్టీఆర్. త‌న కెరీర్ కు టెంప‌ర్ అనేది ఓ టార్చ్ లైట్ అని ఇప్ప‌టికీ చెబుతుంటాడు జూనియ‌ర్.
ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలన్నా.. అందులో న‌టించాల‌న్నా ఆ హీరోకు, ద‌ర్శ‌కుడికి చాలా ద‌మ్ముండాలి. అవి త‌న‌కు ఉన్నాయంటున్నాడు రోహిత్ శెట్టి. ఎన్టీఆర్ పాత్ర‌ను మ‌రిపించ‌లేక‌పోయినా.. అలా ట్రై చేస్తానంటున్నాడు ర‌ణ్ వీర్ సింగ్. టెంప‌ర్ త‌ర్వాతే ఎన్టీఆర్ లో మార్పు వ‌చ్చింది. నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌న‌తా గ్యారేజ్.. జై ల‌వ‌కుశ లాంటి సినిమాలు వ‌చ్చాయి. ఇలాంటి టెంప‌ర్ హిందీ రీమేక్ లో ర‌ణ్ వీర్ సింగ్ న‌టించ‌నున్నాడు. ఈ చిత్రానికి సింబా అనే టైటిల్ పెట్టాడు రోహిత్ శెట్టి. తెలుగులో ఎంతో సీరియ‌స్ గా సాగే ఈ చిత్రాన్ని హిందీలో కామెడీ చేస్తున్నాడు రోహిత్ శెట్టి. ఫ‌స్టాఫ్ అంతా కామెడీగా మార్చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో సైఫ్ కూతుర్ని హీరోయిన్ గా తీసుకున్నాడు రోహిత్ శెట్టి. ఈ విష‌యాన్ని నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. 2018 డిసెంబ‌ర్ 28న సింబా విడుద‌ల కానుంది. చూడాలిక‌.. హిందీ టెంప‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here