డిఎస్పీ.. ది సుప్రీమ్ ప్యాకేజ్ ఆఫ్ మ్యూజిక్..


అవును.. నిజంగానే డి ఎస్ పీ.. అంటే ది సుప్రీమ్ ప్యాకేజ్ ఆఫ్ మ్యూజిక్కే. ఓ సినిమా ఒప్పుకున్నాడంటే దాని పాట‌లు ఇస్తే స‌రిపోతుంది అనుకునే ర‌కం కాదు దేవీ శ్రీ ప్ర‌సాద్. ఆ పాట‌ల‌న్నీ ప్రేక్ష‌కుల్లోకి వెళ్లాలి.. వెళ్లేవ‌ర‌కు మ‌న‌దే బాధ్య‌త అనుకునే అతికొద్ది మంది సంగీత ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. అందుకే ఇన్నేళ్లైనా.. ఇంత మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు వ‌స్తున్నా ఇప్ప‌టికీ దేవీనే నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈయ‌న సంగీత సునామీ ఆగ‌డం లేదు. త‌న పాట‌ల‌తో మాయ చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి.. పాట‌లు కూడా వ‌చ్చాయి. కానీ ఒక్క సారి రంగ‌స్థ‌లం పాట‌లు విడుద‌ల‌వ్వ‌డం మొద‌లైన త‌ర్వాత ఇంకే పాట ఎక్క‌డా వినిపించ‌డం లేదు.
ఎంత స‌క్కగున్నావేతో పాటు రంగ రంగ‌స్థ‌లానా.. ఇక ఇప్పుడు విడుద‌లైన రంగ‌మ్మ మంగ‌మ్మ అన్నీ సూప‌ర్ ఛార్ట్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. సినిమాపై ఆ మ‌ధ్య కొన్ని నెగిటివ్ క‌మెంట్స్ వినిపించాయి. సుకుమార్ ఆల‌స్యం చేస్తున్నాడు సినిమాపై ఏదైనా ప్ర‌భావం చూపిస్తుందేమో అని.. కానీ ఇప్పుడు పాట‌లు విన్న త‌ర్వాత సినిమా క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ఫిక్సైపోతున్నారు ప్రేక్ష‌కులు. అంత‌గా త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు దేవీ. ఈ ఏడాది మొద‌లై మూడు నెల‌లే అయింది. కానీ 2018 టాప్ మ్యూజిక‌ల్ ఆల్బ‌మ్ మాత్రం క‌చ్చితంగా రంగ‌స్థ‌లం అని చెబుతున్నారు మ్యూజిక్ ల‌వ‌ర్స్. అంటే అర్థం చేసుకోవ‌చ్చు ఈ పాట‌లు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గా న‌చ్చేస్తున్నాయో..? అదే మ‌రి.. దేవీకి మిగిలిన సంగీత ద‌ర్శ‌కుల‌కు ఉన్న తేడా..! ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనేనేను.. రామ్ హలో గురు ప్రేమ‌కోస‌మేతో పాటు మ‌రో అర‌జ‌డ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు దేవీ శ్రీ ప్ర‌సాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here