డిజాస్ట‌ర్ తో 2 మిలియ‌న్ ఏంది రాజా..

Agnyaathavaasi Venkatesh Pawan Kalyan photos
అందుకే మ‌రి చెప్పేది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ లెక్కేయ‌డం సాధ్యం కాదు అని..! కావాలంటే చూడండి.. ఈ విష‌యం మ‌రోసారి ప్రూవ్ అయింది. అది కూడా అజ్ఞాతవాసితో. ఈ సినిమా విడుద‌లైన రోజు నుంచి విమ‌ర్శ‌ల జ‌డిలో త‌డిసిపోతూనే ఉంది. డిజాస్ట‌ర్ అని ముక్త‌ఖంఠంతో అంతా ఒకేసారి చెప్పారు. అయినా గానీ తొలిరోజు రికార్డు స్థాయిలో 40 కోట్ల షేర్ అందుకుంది. ఇక ఆ త‌ర్వాత అజ్ఞాత‌వాసి దూకుడు త‌గ్గిపోయింది. అయితే ఇప్పుడు మ‌రో రికార్డు సృష్టించాడు ప‌వ‌ర్ స్టార్. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం 2 మిలియ‌న్ మార్క్ అందుకుంది. అస‌లు ఇంత‌టి డిజాస్ట‌ర్ సినిమా అక్క‌డ 2 మిలియ‌న్ మార్క్ అందుకోవ‌డం ఇప్పుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అస‌లు విదేశాల్లో 2 మిలియ‌న్ మార్క్ అనేది మ‌న సినిమాల‌కు ఓ క‌ల‌. ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లి కాకుండా శ్రీ‌మంతుడు, అ..ఆ, ఖైదీ నెం.150, నాన్న‌కు ప్రేమ‌తో, ఫిదా సినిమాలు మాత్ర‌మే ఆ రికార్డ్ అందుకుంది. ఇప్పుడు డిజాస్ట‌ర్ టాక్ తో ఓపెన్ అయి అజ్ఞాత‌వాసి 2 మిలియ‌న్ క్ల‌బ్బులో చేరింది. ఒక‌వేళ దీనికి కానీ హిట్ టాక్ వ‌చ్చుంటే బాహుబ‌లి 1 రికార్డులు కూడా తుడిచి పెట్టుకుపోయేవేమో మ‌రి..? ఏం చేస్తాం.. ఇమేజ్ ఉంది కానీ హిట్ సినిమాలే ప‌డ‌టం లేదు ప‌వ‌ర్ స్టార్ కు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here