తండ్రిని వ‌దిలేసిన బాల‌య్య‌..

BALAYYA VINAYAK BOYAPATI SR.NTR
అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అంద‌రి మ‌ధ్య‌లో ఇప్పుడు బ‌లైపోతున్న‌ది ఎన్టీఆర్ ఒక్క‌డే. బాల‌య్య తండ్రి బ‌యోపిక్ చేస్తాడేమో.. చూసి త‌రిద్దాం అంటూ నంద‌మూరి అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఎన్నో ఆశ‌లతో వేచి చూస్తున్నారు. కానీ బాల‌య్య తీరు చూస్తుంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ కు పూర్తిగా మంగ‌ళం పాడిన‌ట్లుగానే అనిపిస్తుంది.
ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తే ఇదే అనిపిస్తుంది మ‌రి. ప్ర‌స్తుతం వినాయ‌క్ సినిమాతో బిజీ అయ్యాడు బాల‌య్య‌. ఈ చిత్రం మే 27 నుంచి మొద‌లు కానుంది. ఇక జూన్ 10న బోయ పాటి శీనుతో సినిమాకు ముహూర్తం పెట్ట‌నున్నాడు బాల‌కృష్ణ‌. ఆ రోజు ఆయ‌న పుట్టిన‌రోజు. దాంతో అదే రోజు ముహూర్తం పెట్ట‌నున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్లాన్ చేస్తున్నారు.
ఎందుకంటే ఆ లోపు చ‌ర‌ణ్ తో చేస్తోన్న సినిమాను బోయ‌పాటి పూర్తి చేయ‌బోతున్నాడు కాబ‌ట్టి. ఇక సెప్టెంబ‌ర్ నాటికి వినాయ‌క్ సినిమా కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేస్తుంది. అప్పుడు బోయ‌పాటి సినిమా మొద‌లు పెట్టి ఎన్నిక‌ల నాటికి విడుద‌ల చేయాల‌నేది బాల‌య్య ప్లాన్. గ‌త ఎన్నిక‌ల టైమ్ లో వ‌చ్చిన లెజెండ్ ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాంతో ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు.
మ‌రి వినాయ‌క్ ఓకే.. బోయ‌పాటి ఓకే.. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ ఎక్క‌డున్నాడు..? ఈయ‌న బ‌యోపిక్ ఎక్క‌డుంది..? ఇప్ప‌ట్లో ఉంటుందా లేదంటే బాల‌య్య కెరీర్ లో మ‌రో న‌ర్త‌న‌శాల అవుతుందా..? ఇదే ఇప్పుడు నంద‌మూరి అభిమానుల్లో ఉన్న భ‌యం. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here