తండ్రి మాట విన‌ని అల్లుశిరీష్..

ALLU SHIRISH SPEED UP HIS MOVIES
మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలంతా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ కూడా వ‌స్తున్నాడు. ఇంత మంది గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబంలో అల్లు శిరీష్ మాత్రం ఎందుకో వెన‌క‌బ‌డిపోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ప్ప మ‌రో హిట్ లేదు. కానీ ఈ చిత్రం తెచ్చిన గుర్తింపును ఒక్క క్ష‌ణం ప‌ట్టుకుపోయింది. ఈ చిత్రం క‌నీసం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేక శిరీష్ రేంజ్ ఏంటో మ‌రోసారి చూపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో స్పీడ్ పెంచుతున్నాడు.
ఇన్నాళ్లూ ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా అంటూ మెల్ల‌గా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు స్పీడ్ పెంచ‌బోతున్నాడు ఈ హీరో. తండ్రి కూడా ఒక‌ప్పుడు త‌న‌ను సినిమా త‌ర్వాత సినిమా చేయాలంటూ సూచించాడ‌ని.. బ‌న్నీ కూడా అలా చేసే స్టార్ అయ్యాడ‌ని గుర్తు చేసాడు శిరీష్. అయితే త‌న‌కు మాత్రం ఇప్పుడున్న పోటీ త‌ట్టుకోవాలంటే వ‌ర‌స‌గా సినిమాలు చేయ‌డం త‌ప్ప‌ద‌ని ఫిక్స్ అయ్యాడు అల్లు వార‌బ్బాయి.
అందుకే తండ్రి చెప్పిన మాట కూడా కాద‌ని.. ఇప్పుడు సొంత దారి సృష్టించుకుం టున్నాడు శిరీష్. ప్ర‌స్తుతం మ‌ళ‌యాల సినిమా ఏబిసిడి తెలుగు రీమేక్ లో న‌టిస్తున్నాడు శిరీష్. ఇక దాంతోపాటు సూర్య-కేవీ ఆనంద్ సినిమాలో కూడా అల్లు శిరీష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈ దారిలో అల్లు వార‌బ్బాయి జాత‌కం ఎలా మార‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here