తండ్రి సినిమా రీమేక్ లో నాగ‌చైత‌న్య‌.. 

NagaChaitanya,Samantha & Rana In An Family Event!
తండ్రి ఆస్తులు త‌న‌యుల సొంతం. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఇండ‌స్ట్రీలో ఇష్ట‌మొచ్చిన‌ట్లు వార‌స‌త్వాన్ని వాడేసుకుంటున్నారు మ‌న హీరోలు. తండ్రులు న‌టించిన సినిమాలు కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్ప‌టికే గ‌తేడాది ఈయ‌న న‌టించిన రారండోయ్ వేడుక చూద్ధాం నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌హాలో ఉంటుంది. ఈ క‌థ సిద్ధం చేసుకున్న‌దే నిన్నే పెళ్లాడ‌తా నుంచి. ఆ సినిమా సూప‌ర్ హిట్. ఇక ఇప్పుడు మ‌రోసారి నాన్న సినిమానే వాడుకుంటున్నాడు చైతూ. ఈ సారి ప‌క్కా మాస్ క‌థ తీసుకుంటున్నాడు. మారుతితో ఈయ‌న చేయ‌బోయే సినిమాకు శైల‌జారెడ్డి అల్లుడు అనే టైటిల్ పెడుతున్నారు. ఇందులో పొగ‌రుబోతు అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌నుంది. ఇక ఈ చిత్రం అప్ప‌ట్లో నాగార్జున న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ అల్ల‌రి అల్లుడుకు రీమేక్ అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం చందూమొండేటి స‌వ్య‌సాచితో బిజీగా ఉన్న చైతూ.. త్వ‌ర‌లోనే మారుతి సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. మ‌రి చూడాలిక‌.. నాగ్ క్లాసిక్ సినిమా చైత‌న్య‌కు ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here