తండ్రి.. తాత పాత్రల్లో నటించడం ఇప్పటి హీరోలకు చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఇప్పుడు బాలయ్యకు అవకాశం రాబోతుంది. లేదు తనకు తానే సృష్టించుకున్నాడు బాలయ్య. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోతున్నాడు. ఇప్పుడు నాగచైతన్యకు కూడా ఇదే అవకాశం రానుంది. ఈ సారి ఈయన నటించబోయేది తండ్రి నాగార్జున పాత్రలో కాదు.. తాత ఏఎన్నార్ పాత్రలో. అవును.. నాగేశ్వరరావ్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఇన్ని రోజులు మహానటిలో ఏఎన్నార్ పాత్ర ఎవరు చేస్తున్నారో క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ అని చాలా కాలం నుంచి వినిపిస్తున్న వార్తలు. కానీ ఇప్పుడు ఇది నిజం కాదు.. ఈ పాత్ర కోసం నాగచైతన్యను అడిగారని తెలుస్తుంది. మార్చ్ 14..15 తేదీల్లో దీనికి సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చాడు చైతూ. ఈ రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయనున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. చైతూకు ఈ సినిమాతో పాటు ఇంకా చాలా చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఏఎన్నార్ దొరికాడు కానీ ఎన్టీఆర్ మాత్రం దొరకలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను అడిగినా కూడా ఆయన ఒప్పుకోలేదు. దాంతో డిజిటల్ ఎన్టీఆర్ ను సృష్టించాలని ఫిక్సైపోయాడు నాగ్ అశ్విన్. మార్చ్ లో విడుదల కావాల్సిన మహానటి.. ఇప్పుడు అనుకోని కారణాలతో జూన్ కి వెళ్లిపోయిందని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఇంత మంది మహానుభావుల కలయికతో వస్తున్న మహానటి ఎలా ఉండబోతుందో..?