తెలుగ‌మ్మాయికి ఆఫ‌ర్ ఇచ్చిన త్రివిక్ర‌మ్..


ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ల‌కు స‌రైన రోల్స్ రావ‌ట్లేదు అంతే. వ‌స్తే క‌చ్చితంగా వాళ్లు ముంబై ముద్దుగుమ్మ‌ల కంటే బాగానే న‌టిస్తారు. ఈ విష‌యం ఇప్ప‌టికే అంజ‌లి లాంటి వాళ్లు ప్రూవ్ చేసారు కూడా. కానీ మ‌న ద‌ర్శ‌కులే అప్పుడ‌ప్పుడూ తెలుగ‌మ్మాయిల‌కు చాన్సులు ఇస్తుంటారు.
ఇప్పుడు కూడా అంతే. త్రివిక్ర‌మ్ క‌న్ను ఇప్పుడు ఇషారెబ్బాపై ప‌డింది. ఈ తెలుగ‌మ్మాయి ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో న‌టించి ప‌ర్లేదు అనిపించింది. మొన్న‌టికి మొన్న అ.. సినిమాలో బాగానే న‌టించింది. ఇక ఇప్పుడు ఈ భామ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌లో న‌టించ‌బోతుంది. ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర కోసం ఇషాను తీసుకుంటున్నాడు మాట‌ల మాంత్రికుడు.
ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. మొన్నే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అక్టోబ‌ర్ లోనే విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తుంది. మ‌రి ఇషాను ఏ పాత్ర కోసం తీసుకున్నారు అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. పాత్ర ఏదైతేనేం.. కనీసం ఈ చిత్రంతో అయినా ఇషా జాత‌కం మారుతుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here