తేజ కావాల‌నే ఆ బ‌యోపిక్ చేస్తున్నాడా..?


ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌దిలేసాడు.. ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ ప‌ట్టాలెక్కిస్తున్నాడు తేజ‌. బాల‌య్య‌తో వ‌చ్చిన విభేధాల కార‌ణంగానే పెద్దాయ‌న బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దీని త‌ర్వాత ఏదైనా వేరే సినిమా చేస్తాడేమో అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఓ సంచ‌ల‌న బ‌యోపిక్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు తేజ‌.
అదే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్. నిజానికి ఈయ‌న జీవితంలో బ‌యోపిక్ చేసేంత గొప్పేం లేదు. కానీ కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఇప్పుడు ఈ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ బ‌యోపిక్ ను తెర‌పైకి తెస్తున్నాడు తేజ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉద‌య్ కిర‌ణ్ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు.. చిత్రంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు.. ఆ త‌ర్వాత నువ్వునేను.. మ‌న‌సంతా నువ్వే..
నీ స్నేహం లాంటి సినిమాల‌తో స్టార్ అయ్యాడు. చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం త‌ర్వాత 14 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు.. అది క్యాన్సిల్ అయిన త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయాడు. ఇదే ఈయ‌న జీవితం. చివ‌రికి 2014లో ఉద‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చూడ్డానికి సింపుల్ క‌థే.. కానీ ఉద‌య్ జీవితాన్ని కావాల‌నే కొంద‌రు కాంట్ర‌వ‌ర్సీ చేస్తున్నారు. ఇప్పుడు కానీ తేజ ఈ బ‌యోపిక్ చేసాడంటే చాలా చూపించాల్సి వ‌స్తుంది. అవ‌న్నీ చూపిస్తే తేజ‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. అన్న‌ట్లు ఈ బ‌యోపిక్ కు ఈయ‌న కాబోయే అల్లుడు అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టాడు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here