త్రివిక్ర‌మ్ నిజంగా భ‌య‌ప‌డుతున్నాడా..?

 Trivikram bold decision for Agnathavasi
అదేంటి.. ఎందుకు ఇప్పుడు త్రివిక్ర‌మ్ కు భ‌యం.. ఆయ‌న స్టార్ డైరెక్ట‌ర్.. పైగా స్టార్ హీరోలంతా ఆయ‌న కోసం క్యూ క‌డ‌తారు క‌దా ఇప్పుడు ఆయ‌న భ‌యం ఏంటి అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఈయ‌న ప్ర‌స్తుతం అజ్ఞాత‌వాసి సినిమాతో వ‌స్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు. ఇప్ప‌టికే ఈ చిత్ర టీజ‌ర్.. పాట‌లు.. ప్రోమో సాంగ్ అన్నీ విడుద‌ల‌య్యాయి. మ‌రో ఐదు రోజుల్లో సినిమా కూడా విడుద‌ల కానుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ మాత్రం రాలేదు. ఈ చిత్ర ట్రైల‌ర్ కు త్రివిక్ర‌మే అడ్డు ప‌డుతున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ఆధారంగా తెర‌కెక్కింద‌నే వార్త‌లున్నాయి.
ఇప్ప‌టికే కాపీరైట్ ఇష్యూ కింద రీమేక్ రైట్స్ కొన్న టి సిరీస్ కు 10 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చారు అజ్ఞాత‌వాసి నిర్మాత రాధాకృష్ణ‌. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ కానీ విడుద‌లైతే అది కాపీ అని తెలుస్తుంద‌నే భ‌యం త్రివిక్ర‌మ్ లో క‌నిపిస్తుందంటున్నారు విశ్లేష‌కులు. అందుకే ఈ చిత్ర ట్రైల‌ర్ ఆల‌స్యం అవుతుంద‌ని స‌మాచారం. జ‌న‌వ‌రి 5నే రావాల్సిన ట్రైల‌ర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. అయితే వెరీ సూన్ అంటూ మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసారిప్పుడు. జ‌న‌వ‌రి 6న ఈ ట్రైల‌ర్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. అప్పుడు కూడా వ‌స్తుంద‌నే క్లారిటీ అయితే లేదు. రిలీజ్ కు స‌రిగ్గా నాలుగు రోజులు కూడా లేదు. ఇప్పుడు కానీ ట్రైల‌ర్ వ‌స్తే జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు అదే ర‌చ్చ న‌డుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ కోసం అభిమానులు ఇంకెంత‌గా వేచి చూడాలో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here