త్రివిక్ర‌మ్ మార‌లేదా ఏంటి..? 


అజ్ఞాత‌వాసితో అనుకోకుండా భారీ డిజాస్ట‌ర్ ను మూట గ‌ట్టుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. అప్ప‌టి వ‌ర‌కు త్రివిక్ర‌మ్ సినిమా అంటే క‌చ్చితంగా ఏదో ఎంట‌ర్ టైన్మెంట్ ఉంటుంద‌ని న‌మ్మిన వాళ్ల‌ను అజ్ఞాత‌వాసి నిండా ముంచేసింది. ఈ చిత్రంలో కామెడీ కాదు క‌దా.. అస‌లు త్రివిక్ర‌మేనా డైరెక్ట్ చేసింది అనేంత కోపాన్ని.. అస‌హ‌నాన్ని తెప్పించాడు మాట‌ల మాంత్రికుడు. అలాంటి సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. క‌చ్చితంగా ఈయ‌న‌తో ఏదో కొత్త‌గా ట్రై చేస్తాడ‌ని అంతా అనుకున్నారు కానీ ఈ సారి కూడా రొటీన్ క‌థ‌తోనే వ‌స్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. అది కూడా ఫ్యాక్ష‌న్ క‌థ‌.. దానికితోడు క‌త్తుల‌తో సావాసం.. ఇవ‌న్నీ చూస్తుంటే అద్భుతం చేస్తే త‌ప్ప ఎన్టీఆర్ సినిమా ఆడ‌దు. అది త్రివిక్ర‌మ్ కు కూడా తెలుసు. అందుకే టైటిల్ ప్ల‌స్ ఫ‌స్ట్ లుక్ లోనే త‌ను చెప్పాల‌నుకున్న‌ది సూటిగా చెప్పేసాడు మాట‌ల మాంత్రికుడు. జ‌ల్సాలో కాసేపు మాత్ర‌మే ఫ్యాక్ష‌న్ చూపించిన త్రివిక్ర‌మ్.. ఈ సారి క‌థ మొత్తం అక్క‌డే తిప్ప‌బోతున్నాడు. మ‌రి చూడాలిక‌.. రాయ‌ల‌సీమ‌లో త్రివిక్ర‌ముడి క‌థ‌లు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here