త్రివిక్ర‌మ్ మొద‌లుపెడుతున్నాడోచ్..!

NTR28
మొద‌లైపోతుంది.. ఇంక మొద‌లైపోతుంది.. త్వ‌ర‌లోనే మొద‌లైపోతుంది.. ఇప్పుడు అప్పుడు అంటోన్న త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్ సినిమాకు అన్నీ సిద్ధం అవుతున్నాయి. మార్చ్ 23 నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు త్రివిక్ర‌మ్ సినిమాల‌కు ఇంత క‌న్ఫ్యూజ‌న్ ఎప్పుడూ లేదు.. కానీ ఇప్పుడొస్తుంది. ఎన్టీఆర్ సినిమాతోనే ఏదేదో అయిపోతుంది. ఈ సినిమాకు ముందు అన్నీ అనుకున్న‌ట్లే జ‌రిగాయి. కానీ అజ్ఞాతవాసి ఫ్లాప్ త‌ర్వాత అన్నీ మారిపోతున్నాయి. త్రివిక్ర‌మ్ పై అప్ప‌టి వ‌ర‌కు ఉన్న న‌మ్మ‌కం కాస్త స‌న్న‌గిల్లింది. ఎన్టీఆర్ సినిమాపై తొలిసారి అనుమానం మొద‌లైంది కూడా అప్పుడే. అయితే ఒక్క ఫ్లాప్ తో ఆయ‌న టాలెంట్ ను త‌క్కువ చేయ‌డం త‌గ‌దు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే భావిస్తున్నాడు. ఈయ‌న సినిమా మార్చ్ 23 నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఆ లోపు సినిమా టెక్నిక‌ల్ టీం కూడా రెడీ చేసుకుంటున్నారు. అనిరుధ్ స్థానంలో ఇప్ప‌టికే సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్ ను ఫైన‌ల్ చేసారు. హీరోయిన్ ఎవ‌రో ఇంకా క్లారిటీ రాలేదు. పూజాహెగ్డే ఆల్ మోస్ట్ ఫైన‌ల్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ముందు మ‌రొక‌ర్ని అనుకున్నా.. చివ‌రికి పిఎస్ వినోద్ వ‌చ్చి చేరాడు. ఈయ‌న గ‌తంలో విక్ర‌మ్ కే కుమార్ సినిమాల‌తో పాటు ధృవ సినిమాకు ప‌ని చేసాడు. ఎన్టీఆర్ కోసం అంతా కొత్త వాళ్ల‌తోనే ముందుకెళ్తున్నాడు త్రివిక్ర‌మ్. పాత టీం కాస్త తేడా కొట్ట‌డంతో ఇప్పుడు కొత్త‌గా ట్రై చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. మ‌రి సినిమా కూడా అంతే కొత్త‌గా ఉంటుందో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here