త‌ప్పుకోండి.. ఐట‌మ్ బాయ్స్ వ‌స్తున్నారు..


ఐటం గాళ్స్ విన్నాం కానీ బాయ్స్ ఏంటి.. వాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారా..? ఉంటారు.. ఉంటార‌ని బాలీవుడ్ హీరోలు నిరూపిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే అక్క‌డ ఊపందుకుంటుంది. ఇన్నాళ్లూ ఐటం గాళ్స్ అంటూ అదిరిపోయే అందాల షో చేసేవాళ్లు ముద్దుగుమ్మ‌లు.
కానీ ఇప్పుడు హీరోలే వ‌స్తున్నారు.. చిందేస్తున్నారు. త‌మ వాళ్ల కోసం.. కావాల్సిన వాళ్ల కోసం.. స్నేహితుల కోసం ప్ర‌త్యేకంగా ఓ ఐదు నిమిషాలు డాన్సులు చేసి వెళ్లి పోతున్నారు. తాజాగా భ‌వేష్ జోషి సినిమా కోసం అర్జున్ క‌పూర్ చేసిన ఐటం సాంగ్ సంచ‌ల‌నం అయిపోయింది. ఇందులో అర్జున్ త‌మ్ముడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ హీరోగా న‌టించాడు. త‌మ్ముడికి స‌పోర్ట్ గా ఐటం సాంగ్ చేసి ఐటం బాయ్ అయిపోయాడు అర్జున్ క‌పూర్.
గతంలో స‌ల్మాన్ నిర్మించిన చిల్ల‌ర్ పార్టీ సినిమా కోసం ఇలాగే ఐటం బాయ్ అయిపోయాడు ర‌ణ్ బీర్ క‌పూర్. ఇక అమీర్ ఖాన్ కూడా అంతే.. ఈయ‌న కూడా అల్లుడు ఇమ్రాన్ ఖాన్ తో చేసిన ఢిల్లీబెల్లీ కోసం స్పెష‌ల్ సాంగ్ చేసాడు. ఇలా అక్క‌డి హీరోలు ఇప్పుడు ఏ ఇగోల‌కు పోకుండా సింపుల్ గా ఐటం బాయ్స్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here