త‌మిళ హీరోలంతా అర్జున్ రెడ్డిలే..

Tamil heroes in Arjun Reddy style
అర్జున్ రెడ్డి అనేది పేరు కాదిప్పుడు.. అదో బ్రాండ్. ఎంత‌లా అంటే ఆటిట్యూడ్ చూపించాలంటే అర్జున్ రెడ్డి అంటే అయిపోతుంది. ఇక ఈ సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్.. సృష్టించిన సంచ‌ల‌నం.. క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇప్పుడు హాట్ టాపిక్కే. ఏ హీరో అయినా క‌ల‌లు క‌నే సినిమా ఇది. కానీ ఈ క‌థ‌లు చేయాలంటే డేర్ కావాలి. కెరీర్ లో ఎప్పుడో ఓ సారి.. ఏదో ఓ సినిమా చేస్తుంటారు హీరోలు. అది కెరీర్ అంతా వెంటాడుతూనే ఉంటుంది. నాగార్జున‌కు శివ‌.. చిరంజీవికి ఖైదీ.. వెంక‌టేశ్ కు బొబ్బిలిరాజా.. బాల‌య్య‌కు మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు.. ఇలా ఏ స్టార్ హీరోకు తీసుకున్నా కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా ఒక‌టి ఉంటుంది. చాలా త‌క్కువ టైమ్ లోనే విజ‌య్ దేవర‌కొండ కూడా త‌న కెరీర్ లో ఓ మైలురాయిని ప‌ట్టుకున్నాడు. అదే అర్జున్ రెడ్డి. నో డౌట్.. అర్జున్ రెడ్డి లాంటి సినిమా విజ‌య్ కెరీర్ లో మ‌ళ్లీ రాదు.
అస‌లు ఈ చిత్రం మొద‌లైన‌పుడు వ‌స్తుంద‌నే విష‌య‌మే ఎవ‌రికీ తెలియ‌దు. కానీ విడుద‌లైన త‌ర్వాత ఓ సినిమాతో ఇంత ఫీవ‌ర్ ప‌ట్టుకుంటుందా అనే రీతిలో అర్జున్ రెడ్డి ర‌చ్చ చేసాడు. ఇంటా బ‌య‌టా కుమ్మేసాడు. ఈ చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ అన‌డం కూడా త‌క్కువే. దానికి మించి వ‌సూలు చేసింది అర్జున్ రెడ్డి. ఇక ఈ చిత్రం క్రేజ్ చూసి స్టార్ హీరోలు కూడా బిత్త‌ర‌పోతున్నారు. సినిమా వ‌చ్చి ఇన్ని నెల‌ల‌వుతున్నా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి ఫీవ‌ర్ అలాగే ఉంది. ఈ హ్యాంగోవ‌ర్ నుంచి ఇంకా బ‌య‌టికి రాలేక‌పోతున్నారు ఫ్యాన్స్. అమ్మాయిలు కూడా అర్జున్ రెడ్డి టీ ష‌ర్ట్స్ వేసుకుని ర‌చ్చ చేస్తున్నారు. ఇక విజ‌య్ కూడా ఈ హ్యాంగోవ‌ర్ లోనే ఉన్నాడింకా.
ఇక ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీని కూడా అర్జున్ రెడ్డి ఫీవ‌ర్ అంటుకుంది. ఇప్ప‌టికే అక్క‌డ వ‌ర్మ పేరుతో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి పాత్ర‌లో స్టార్ హీరోలు ఉంటే ఎలా ఉంటుంది అని న‌వ్వుకోడానికి ఓ ఫోటో చేసారు. అందులో ర‌జినీ నుంచి ధ‌నుష్ వ‌ర‌కు అంద‌ర్నీ అర్జున్ రెడ్డిగా మార్చేసారు. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది. అంతేకాదు.. ఐఎమ్ డిబిలో అర్జున్ రెడ్డి దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో విక్ర‌మ్ వేధ‌.. రెండోస్థానంలో బాహుబ‌లి 2 ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here