త‌మ‌న్నా.. కిల్లింగ్ ఎక్స్ ప్రెష‌న్స్..

Kalyan-Ram-And-Tamanna-Naa-Nuvve-Poster-1528896189-192

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 13 ఏళ్ల‌వుతున్నా కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్ ల‌కు పోటీగానే పోటెత్తుతుంది త‌మ‌న్నా. వ‌య‌సు 30కి చేరువైనా కూడా ఈ రోజుకు కూడా త‌మ‌న్నా అంటే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది పాలు గారే అందాలే. ఇప్ప‌టికీ ఆ ఫిజిక్ అలా మెయింటేన్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది త‌మ‌న్నా. అయితే ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ నా నువ్వేలో మాత్రం అమ్మ‌డు నెక్ట్స్ లెవ‌ల్లో రెచ్చిపోయింది. ఎక్స్ ప్రెష‌న్స్ విష‌యంలో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు త‌మ‌న్నా.

అవి చూస్తుంటే కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేదు. అంత‌గా రెచ్చిపోయారు ఈ జంట‌. నా నువ్వేలో త‌మ‌న్నా అందాలే ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌. ట్రైల‌ర్.. టీజ‌ర్.. పాట‌లు.. ఇలా ఏది తీసుకున్నా త‌మ‌న్నా ధ‌గ ధ‌గ‌లు మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా సాల్సా డాన్స్ లో క‌ళ్యాణ్ రామ్ తో త‌మ‌న్నా రొమాన్స్ చూసి అబ్బో అనుకుంటున్నారంతా. అంత‌గా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు విడుద‌లైన ఓ స్టిల్ కూడా బాగా ఆక‌ట్టుకుంటుంది.

ఒక‌ర్ని ఒక‌రు పెన‌వేసుకుపోయిన‌ట్లుగా ఉండే ఈ స్టిల్ చూస్తుంటే బాపురే.. ఏం ఘాటురే అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి త‌మ‌న్నా గ్లామ‌ర్ ఓపెనింగ్స్ తీసుకొస్తుంద‌న‌డంలో అత‌శ‌యోక్తి లేదేమో..? గ‌తంలోనూ బద్రీనాథ్ లాంటి సినిమాల‌కు త‌మ‌న్నా గ్లామ‌ర్ ఆయుధంగా ప‌నికొచ్చింది. ఇన్నాళ్లూ స్టార్ హీరోల‌తోనూ న‌టిస్తూ వ‌చ్చిన త‌మ‌న్నా.. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోల‌తోనూ న‌టించ‌డానికి రెడీ అవుతుంది. జూన్ 14న నా నువ్వే విడుద‌లైంది. మ‌రి చూడాలిక‌.. షేర్.. యిజం.. ఎమ్మెల్యేతో హ్యాట్రిక్ ఫ్లాప్ పూర్తి చేసిన క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రంతోనైనా హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here