త‌మ‌న్నా చూపించ‌కుండానే చంపేస్తుందిగా.. 

ఊపిరి ఆపేయాలంటే అందాలే ఆర‌బోయాల్సిన ప‌నిలేదు.. అప్పుడప్పుడూ అన్నీ క‌ప్పుకుని కూడా చూపుల‌తో చంపేయొచ్చు. ఇప్పుడు త‌మ‌న్నా చేసింది కూడా అదే. ఈ భామ తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ కోసం ఎరుపు డ్ర‌స్ లో పిచ్చెక్కించింది ఈ మిల్కీబ్యూటీ. ఈ భామ‌కు ఇప్పుడు టైమ్ అంత‌గా క‌లిసి రావ‌డం లేదు. ఏడాది కింది వ‌ర‌కు స్టార్ హీరోయిన్ గానే ఉన్న త‌మ్ము.. ఇప్పుడు అవ‌కాశాల కోసం చూస్తుంది. ఈ మ‌ధ్యే ల‌క్మే ఫ్యాష‌న్ వీక్ లో న‌డుము అందాల‌తో కుర్ర‌ళ్ల‌కు అందాల న‌ర‌కం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు మ‌రో సారి అందాలు చూపించ‌కుండా కొంటెగా తినేసేలా చూస్తుంది. ఈమె చూపులు చూసి.. ఓరి బ్ర‌హ్మ‌దేవుడా ఎంత గొప్ప సొగ‌సురా అని పాడ‌కుంటే చూడండి..? ఈ మ‌ధ్య ఫోటోషూట్లే కాదు.. బ‌య‌టికి వ‌చ్చినా కూడా అందాలే ఆయుధంగా ముందుకొస్తుంది త‌మ‌న్నా. ప్ర‌తీచోట‌ ఈమె హొయ‌లు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. వాళ్ల ఆలోచ‌న‌లు అలాగే ఉండాల‌ని.. ఈ మ‌ధ్య వేడుక‌ల్లో రెచ్చిపోయి మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత త‌మ‌న్నాకు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యే ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. దాంతో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు ఈ మిల్కీ బ్యూటీ. పాల‌రాతి అందాల్ని అందంగా కెమెరాకు అరువిచ్చేసింది. మొత్తానికి త‌మ‌న్నా అందాలు ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here