త‌మ‌న్నా విష‌యంలో అది నిజ‌మేనా..?


త‌మ‌న్నాకు ఇప్పుడు అవ‌కాశాలు రావ‌డం లేదు అనేది ఒప్పుకోవాల్సిన స‌త్యం. ఆమెను స్టార్ హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇందులో కూడా ఎవ‌రికీ ఏ అనుమానాలు లేవు. ఎందుకంటే 13 ఏళ్లైపోయింది అప్పుడే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి. ఇన్నేళ్ల‌లో స్టార్స్ అంద‌రితోనూ న‌టించేసింది. దాంతో ఇప్పుడు కుర్ర హీరోలెవ‌రూ త‌మ‌న్నా వైపు చూడ‌టం లేదు. ఇలాంటి టైమ్ లో ఆమెకు కోటి ఇచ్చినా కూడా ఎక్కువే అంటున్నారు. కొంద‌రు కోసం ల‌క్ష‌ల్లో కూడా తీసుకుని న‌టిస్తుంది త‌మ‌న్నా. ఇలాంటి టైమ్ లో ఆమెకు ఏకంగా 2 కోట్ల పారితోషికం అందింది. అది కూడా చిన్న సినిమా కోసం.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ఇండ‌స్ట్రీలో. ఆ సినిమా పేరు నా నువ్వే.. హీరో క‌ళ్యాణ్ రామ్. నిర్మాత మ‌హేశ్ కోనేరు. ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఈ పాత్ర కోసం త‌మ‌న్నాను ఒప్పించారు నిర్మాత‌లు. దానికోసం ఏకంగా ఈ భామ‌కు రెండు కోట్లు పారితోషికం ఇచ్చార‌ని తెలుస్తుంది. క‌ళ్యాణ్ రామ్ తో న‌టించ‌డానికి త‌మ‌న్నా ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంది. దాంతోపాటే ఇప్పుడు వెంక‌టేశ్ తో ఎఫ్ 2లో న‌టిస్తుంది త‌మ్మూ. ఇక సైరాలో చిరుతో కూడా జోడీ క‌ట్ట‌బోతుంది. మొత్తానికి జూనియ‌ర్ హీరోలు ప‌క్క‌న‌బెట్టేస‌రికి సీనియ‌ర్ అయిపోయింది మిల్కీబ్యూటీ. ఈ రెండు సినిమాల కోసం కోటికి అటూఇటూగానే పారితోషికం అందుకుంటుంది త‌మ‌న్నా. కానీ క‌ళ్యాణ్ రామ్ సినిమాకు మాత్రం ఏకంగా ఆస్తులు రాయించేసుకుంది. అంతెలే.. అదృష్టం అంటే ఇలాగే ఉంటుంది మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here