థ‌మ‌న్ ఎలా చేస్తున్నాడ‌బ్బా..!

SS THAMAN MOVIES FAST RACE
కాపీ క్యాట్ అంటారు.. మ్యూజిక్ కొత్త‌గా లేదంటారు.. చేసిన పాట‌ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తాడంటారు.. అయినా కానీ థ‌మ‌న్ కోసం స్టార్ హీరోలు.. ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ కంటే ఎక్కువ సినిమాలే ఇప్పుడు థ‌మ‌న్ చేతిలో ఉన్నాయి. చిన్న హీరోల‌తో పాటు స్టార్స్ కూడా ఇప్పుడు థ‌మ‌న్ కావాలంటున్నారు. ఈయ‌న ఎప్పుడూ రేస్ లో లేన‌ట్లే క‌నిపిస్తుంటాడు. కానీ అవ‌కాశాల వేట‌లో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటాడు.
అస‌లు అర్థం కాని ఫ‌జిల్ లా ఉంటాడు థ‌మ‌న్. దేవీ జోరు ముందు త‌ల వంచిన‌ట్లే క‌నిపిస్తాడు కానీ అత‌డి కంటే ఎక్కువ జోరు చూపిస్తుంటాడు. అర్థం కాని ఫ‌జిల్ లా ఉంటాడు థ‌మ‌న్. ఇత‌డి దూకుడు ఈ మ‌ధ్యే బాలీవుడ్ కు కూడా వెళ్లింది. అక్క‌డ రోహిత్ శెట్టి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాకు సంగీతం అందించాడు థ‌మ‌న్.
గోల్ మాల్ అగైన్ కు సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌నే. ఈ సినిమాతో పాటు మ‌రో భారీ సినిమాకు కూడా సంగీతం అందించే అవ‌కాశం అందుకున్నాడు థ‌మ‌న్. ఇక ద‌క్షిణాదిన మ‌నోడి బిజీ గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవు. ఇక్క‌డ అనుష్క భాగ‌మ‌తి.. సాయి ధ‌రంతేజ్- వినాయ‌క్ సినిమా.. నితిన్-కృష్ణ చైత‌న్య సినిమా.. మోహ‌న్ బాబు సినిమా గాయ‌త్రి.. వ‌రుణ్ తేజ్-వెంకీ అట్లూరి తొలిప్రేమ‌.. ఇలా చాలా సినిమాలు ఇప్పుడు థ‌మ‌న్ ఖాతాలో ఉన్నాయి. పైగా ఇప్పుడు బోయ‌పాటి-రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రాబోయే సినిమాకు కూడా థ‌మ‌న్ నే సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకుంటున్నారు. మొత్తానికి మ‌రి ఈ సినిమాల‌తో థ‌మ‌న్ ఏం మాయ చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here