దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులోకి వ‌స్తున్నాడా..?


దుల్క‌ర్ స‌ల్మాన్.. మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో ఈ పేరు బాగా పాపుల‌ర్. అక్క‌డ స్టార్ హీరో.. త్వ‌ర‌లోనే సూప‌ర్ స్టార్ కూడా అయిపోతాడేమో..? 90 శాతం స‌క్సెస్ రేట్ తో దూసుకుపోతున్న కుర్ర సంచ‌ల‌నం. మ‌మ్ముట్టి న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన దుల్క‌ర్.. కేర‌ళ‌లో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయ‌న చూపులు తెలుగు ఇండ‌స్ట్రీపై ప‌డ్డాయా అనే అనుమానం వ‌స్తుంది. ఏమో ఇప్పుడు ఈయ‌న చేస్తోన్న ప‌నులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. వ‌ర‌స‌గా తెలుగు హీరోల‌తో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు దుల్క‌ర్. ఇప్పుడు ఈయ‌న హైద‌ర‌బాద్ లోనే ఉన్నాడు. మొన్న‌టికి మొన్న అఖిల్ మూడో సినిమా ఓపెనింగ్ లో దుల్క‌ర్ మెరిసాడు. ఎందుకు అంటూ ఊరికే అనే స‌మాధానం వ‌చ్చింది. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఇంటికి వెళ్లి మ‌రి అఫీషియ‌ల్ గా బ‌ర్త్ డే విషెస్ చెప్పి ఓ ఫోటో కూడా దిగాడు దుల్క‌ర్ స‌ల్మాన్. ఈ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు మ‌హాన‌టిలో జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు దుల్క‌ర్. ఇది తెలుగు సినిమా. త‌మిళ్ లోనూ ఒకే సారి తెర‌కెక్కుతుంది. పైగా ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే చేరువ‌య్యాడు దుల్క‌ర్ స‌ల్మాన్. ఈ సెట‌ప్ అంతా చూస్తుంటే త్వ‌ర‌లోనే నేరుగా తెలుగు ఇండ‌స్ట్రీకి దుల్క‌ర్ వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here