దేవుడా.. ఎన్టీఆర్ తో కూడా పూజాహెగ్డేనే..!

 Rangasthalam Pooja Hegde
ఏదో జ‌రుగుతుంది.. పూజాహెగ్డే విష‌యంలో ఏదో జ‌రుగుతుంది. అమ్మ‌డు ఒక్క హిట్ కూడా లేకుండానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్సే వెంట ప‌డి మ‌రీ అవ‌కాశాలు ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మ‌కు. స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా లాంటి హీరోయిన్లు ఓల్డ్ అయిపోవ‌డంతో కొత్త‌వాళ్ళ‌తో జోడీ క‌ట్ట‌డానికి మ‌న హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇదే పూజాకు ఇప్పుడు అవ‌కాశాలు తీసుకొచ్చి పెడుతుంది. గ‌తేడాది వ‌చ్చిన డిజే జ‌స్ట్ ఓకే అనిపించినా కూడా అందులో పూజాహెగ్డే అందాలు మాత్రం అదిరిపోయాయి. దాంతో ఇప్పుడు ఆ అందానికే అభిషేకం చేస్తున్నారు మ‌న ద‌ర్శక నిర్మాత‌లు. ఈ సినిమా త‌ర్వాత పూజా జాత‌క‌మే మారిపోయింది.
రంగ‌స్థ‌లంలో ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఐటం సాంగ్ లో చిందేసింది పూజాహెగ్డే. దానికితోడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యంలో ఈ భామే హీరోయిన్ ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు మ‌హేశ్ -వంశీ పైడిప‌ల్లి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో పూజాకు ఇందులో అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డంలో రాజుగారు దిట్ట‌. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విష‌యంపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలోనూ పూజాహెగ్డేనే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక హాసిని ట్విట్ట‌ర్ లో అఫీషియ‌ల్ గా పూజాహెగ్డేను తీసుకుంటున్న‌ట్లు అనౌన్స్ చేసారు. మార్చ్ నుంచే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.
ఇక బాలీవుడ్ లోనూ పూజాహెగ్డే దూకుడు చూపిస్తుంది. అక్క‌డ ఇప్ప‌టికే హృతిక్ రోష‌న్ తో మొహింజ‌దారో లాంటి భారీ సినిమాలో న‌టించింది. అయితే ఆ సినిమా ప్లాప్ కావ‌డంతో మ‌ళ్లీ పూజా వైపు ఎవ‌రూ చూడ‌లేదు. కానీ ఫ్లాప్ హీరోయిన్ల‌కు ఎప్పుడూ ఆప‌ద్భాంద‌వుడిలా ఉండే స‌ల్మాన్ ఖాన్ క‌న్ను ఇప్పుడు పూజాహెగ్డేపై ప‌డింది. ఈయ‌న త్వ‌ర‌లోనే చేయ‌బోయే రేస్ 3 లో పూజాకు అవ‌కాశ‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్లు పోటీ పడినా అవకాశం మాత్రం పూజాకే దక్కడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైమ్ లో స‌ల్మాన్.. మ‌హేశ్.. ఎన్టీఆర్ లాంటి సూప‌ర్ స్టార్స్ పిలిచి ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో అమ్మాయిగారి ఆనందానికి అవ‌ధుల్లేవు. మొత్తానికి పూజాకు ఫ‌లితం ఇన్నాళ్ల‌కు ద‌క్కుతుంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here