దేవున్ని వ‌దిలేసి భ‌క్తున్ని చేరాడేంటి..?


ఇక్క‌డ దేవుడు ఎవ‌రు..? భ‌క్తుడు ఎవ‌రు..? అస‌లెవ‌రు ఎవ‌రు ఎవ‌రి ద‌గ్గ‌రికి వ‌చ్చారు.. ఈ క‌న్ఫ్యూజ‌న్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడే క్లారిటీ వ‌స్తుందిలెండి. దేవుడు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఆయ‌న భ‌క్తుడు ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతోమంది భ‌క్తుల్లో హీరో భ‌క్తుడు నితిన్.
ఇక ప‌వ‌న్ ను వెన్నంటే ఉండే ద‌ర్శ‌కుల్లో డాలి కూడా ఒక‌రు. ఇప్పుడు ఈ కాంబినేష‌న్ క‌ల‌వబోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ తో రెండు సినిమాలు చేసిన డాలి.. ఇప్పుడు నితిన్ సినిమా చేయ‌డానికి ముస్తాబ‌వుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధం చేసిన‌ట్లు.. త్వ‌ర‌లోనే ఈ చిత్రం మొద‌లు పెడుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా డాలి కూడా మంచి టెక్నీషియ‌నే.
ఆయ‌న‌కు స‌రైన క‌థ ప‌డితే బాగానే డీల్ చేస్తాడ‌ని త‌డాఖా లాంటి సినిమాలు చూపించాయి. ఇక నితిన్ కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వ‌ర‌స‌గా ఫ్లాపులు వ‌స్తున్నా కూడా అవ‌కాశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు స‌తీష్ వేగేశ్న‌తో శ్రీ‌నివాస క‌ళ్యాణం చేస్తున్న నితిన్.. ఆ వెంట‌నే హ‌రీష్ శంక‌ర్ తో దాగుడు మూత‌లు ఆడ‌నున్నాడు. అద‌లా పూర్త‌వుతుందో లేదో ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తోనూ సినిమాకు క‌మిట్మెంట్ ఇచ్చాడు.
అయితే హ‌రీష్, వెంకీ సినిమాల్లో ముందు ఏది తెర‌కెక్కుతుందో ఇప్ప‌ట్లో క్లారిటీ వ‌చ్చేలా లేదు. ఇన్ని సినిమాల‌తో బిజీగా ఉన్న నితిన్.. ఇప్పుడు కొత్త‌గా డాలి సినిమాను సైతం ఓకే చేసాడు. మ‌రి ఇన్ని ప్రాజెక్టుల‌ను ఒకేసారి ఎలా లైన్ లో పెడ‌తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here