ద‌త్తు గారు.. ఎన్ని సినిమాలు చేస్తున్నారు..?


హిట్ వ‌చ్చిన ఆనందంలో ఎన్ని సినిమాలు చేస్తున్నాడో కూడా క్లారిటీ ఇవ్వ‌డం లేదు అశ్వినీద‌త్. ఏడేళ్ల త‌ర్వాత వైజ‌యంతి నుంచి వ‌చ్చిన సినిమా మ‌హాన‌టి.. ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. పైగా శాటిలైట్ లో కూడా రికార్డుల‌కు తెర‌తీస్తుంది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 11 కోట్ల‌కు ఈ చిత్ర హ‌క్కుల్ని జీ నెట్ వ‌ర్క్ సొంతం చేసుకుంది. మ‌హాన‌టి లాంటి లో బ‌డ్జెట్ చిన్న సినిమాకు ఇది చాలా ఎక్కువ మొత్తం. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో వ‌ర‌స సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు అశ్వినీద‌త్. ఇప్ప‌టికే ఈయ‌న నాని, నాగార్జున హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్.. మ‌హేశ్ హీరోగా మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. ఇక 28 ఏళ్ల కింద మే 9న భారీ వ‌ర్షాల్లో విడుద‌లైన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి ఇండ‌స్ట్రీ హిట్ అయింది.. ఇదే రోజు మ‌ళ్లీ ఇప్పుడు మ‌హాన‌టి విడుద‌లైంది. ఇప్పుడు ఎండ‌లు మండిపోతున్నాయి. అయినా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డు తున్నారు. నాని, మ‌హేశ్ సినిమాలు లైన్ లో ఉండ‌గానే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా అనౌన్స్ చేసాడు ఈయ‌న‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే త‌న నిర్మాణంలో సినిమా ఉంటుందంటున్నాడు ద‌త్. ఏదేమైనా వై జ‌యంతికి మ‌ళ్లీ పున‌ర్వైభవం వ‌చ్చింది. అంటే మ‌ళ్లీ మంచి సినిమాలు వ‌చ్చేస్తాయి అన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here