ద‌ర్శ‌కులంతా భ‌లే క‌లిసారే..!

DIRECTORS MEETING DINNER
హీరోలేనా ఎప్పుడూ క‌లిసి ఉండేది తాము కూడా అంతా ఒక్క‌టే అంటున్నారు ద‌ర్శ‌కులు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్ట‌ర్స్ ఉన్నారో అతా ఒకే చోట క‌లిస్తే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. అస‌లు అలా జ‌ర‌గ‌డం కూడా అద్భుత‌మే క‌దా. ఆ అద్భుతానికి తానే శ్రీ‌కారం చుట్టాడు వంశీ పైడిప‌ల్లి. త‌న ఇంట్లోనే ద‌ర్శ‌కులంద‌రికీ డిన్న‌ర్ పార్టీ ఇచ్చాడు. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు..
వంశీ పిలుపు అందుకుని దాదాపు ప‌ది మంది ద‌ర్శ‌కులు వ‌చ్చారు. అందులో రాజ‌మౌళి కూడా ఉండ‌టం విశేషం. జూన్ 10 నుంచి మ‌హేశ్ బాబు సినిమాతో బిజీ కానున్నాడు వంశీ పైడిప‌ల్లి. ఆ లోపే త‌ను అంద‌రు ద‌ర్శ‌కుల‌కు పార్టీ ఇవ్వాల‌నుకుని ఇచ్చేసాడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతానికి క‌థ వండే ప‌నిలో ఉన్నాడు. ఇక ఈ పార్టీకి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా.. మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్.. హ‌రీష్ శంక‌ర్.. సుకుమార్.. క్రిష్.. అనిల్ రావిపూడి.. కొర‌టాల శివ‌..
ఇలా అంతా ఈ పార్టీకి వ‌చ్చారు. అయితే వినాయ‌క్, త్రివిక్ర‌మ్, పూరీ జ‌గ‌న్నాథ్, శీనువైట్ల, సురేంద‌ర్ రెడ్డి లాంటి ద‌ర్శ‌కులు మాత్రం త‌మత‌మ సినిమాల్లో బిజీగా ఉండ‌టంతో డిన్న‌ర్ కు రాలేక‌పోయారు. కానీ ఇలా అంతా ఒకే ఫ్రేమ్ లో క‌నిపించ‌డం మాత్రం అభిమానుల‌కు పండ‌గే. ఒక్క‌సారి హీరోలు కూడా అంతా ఇలా క‌లిసుండి ఒక్కో ఫోటోకు పోజ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here