ధ‌డ‌క్ జింగాత్ సాంగ్.. ఒరిజిన‌లే బెట‌ర్..!

బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను రీమేక్ చేస్తున్న‌పుడు క‌చ్చితంగా పోలిక‌లు త‌ప్ప‌వు. ఒరిజిన‌ల్ కంటే బాగుందా లేదా అనే వాద‌న క‌చ్చితంగా వ‌స్తుంది. ఇప్పుడు ధ‌డ‌క్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఏ పాట విడుద‌లైనా.. ట్రైల‌ర్ విడుద‌లైనా కూడా సైరాత్ తో పోల్చి చూస్తున్నారు. ఇన్ని రోజులు ట్రైల‌ర్.. పాట‌లు అన్నీ సైరాత్ కంటే హిందీలో బెస్ట్ అనిపించాడు ద‌ర్శ‌కుడు శ‌శాంక్ కైతాన్. కానీ తొలిసారి ఓడిపోయాడు ఈయ‌న‌. ఇప్పుడు ధ‌డ‌క్ లోని మోస్ట్ వాంటెడ్ సాంగ్ జింగాత్ వ‌చ్చేసింది.

సైరాత్ లో ఈ పాట దేశాన్ని ఊపేసింది. జింగాత్ అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ రెండేళ్ల కింద ర‌చ్చ ర‌చ్చ చేసింది. భాష అర్థం కాక‌పోయినా కూడా బీట్ బాగుంది క‌దా దేశ‌మంతా ఊగిపోయింది. ఇక ఇప్పుడు ధ‌డ‌క్ లోని ఈ పాట వ‌చ్చేసింద‌.ఇ అస‌లు ఈ పాట‌ను ద‌ర్శ‌కుడు ఎలా తెర‌కెక్కించి ఉంటాడు అని ముందు నుంచే ఆస‌క్తి ఉంది. అయితే ఇప్పుడు ధ‌డ‌క్ పాట మాత్రం దానికి భిన్నంగా ఉంది. రిచ్ గా తీసాడు కానీ ఒరిజిన‌ల్ లో ఉన్నంత ఫీల్ మాత్రం రాలేదు.

అక్క‌డ హీరోయిన్ త‌న చూపులు.. ఎక్స్ ప్రెష‌న్స్ తోనే మాయ చేస్తుంది. కానీ ఈ పాట‌లో ఝాన్వీకి అంత ఛాన్స్ రాలేదు. పాట రిచ్ గా ఉంది కానీ ఒరిజిన‌ల్ ను అయితే మ‌రిపించ‌లేక‌పోయింది. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. సైరాత్ చూసిన వాళ్ల‌కు కూడా ఈ చిత్రం కొత్త‌గా అనిపిస్తుంది.

శ్రీ‌దేవి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని త‌న కూతుర్ని క‌ర‌ణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. పాపం ఆ సినిమా చూడ‌కుండానే ఆమె పైకి వెళ్లిపోయింది. అయితే జాన్వి ప‌రిచ‌యానికి సైరాత్ సరైన సినిమా కాదేమో అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు సైరాత్ లో అంత‌గా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏమీ లేద‌ని.. ఆ టైమ్ లో మ‌రాఠీయుల‌కు ఆ సినిమా ఎందుకో క‌నెక్ట్ అయిపోయిందంతే.. హిందీలో సైరాత్ క్లిక్ అవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. కానీ ఇప్పుడు ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన విధానం చూస్తుంటే సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు ఎక్కేలా క‌నిపిస్తుంది. జులై 20న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here