నందమూరి కళ్యాణ్‌రామ్‌ తమన్నా ల చిత్రం టైటిల్ “నా.. నువ్వే”

Nandamuri Kalyan Ram - Tamannah's Film Titled Naa Nuvve

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లోరూపొందుతోన్న చిత్రం లో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి “నా.. నువ్వే”  అనే టైటిల్ ని నేడు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది. 

కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో  ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతాన్ని అందిస్తున్నారు.

“జనవరి నెలాఖరు కి దాదాపు గా షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి “నా.. నువ్వే” అనే టైటిల్ చాలా అప్ట్ గా ఉంటుంది. ఒక నూతన కాన్సెప్ట్ తో, ఫ్రెష్ లుక్ తో ఈ చిత్రాన్ని దర్శకులు జయేంద్ర గారు తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్ ఈ చిత్రానికే హై లైట్ గా నిలుస్తుంది.  పి. సి. శ్రీరామ్ గారి కెమెరా వర్క్  “నా.. నువ్వే” చిత్రానికి చాలా పెద్ద అసెట్ ” అని నిర్మాత ల లో ఒకరైన కిరణ్ ముప్పవరపు తెలిపారు.

పి. సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్ క్వాలిటీ టెక్నికల్ టీం తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హీరో కళ్యాణ్ రామ్ గారి కి ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ని ఇస్తుంది అని నమ్ముతున్నాం. వేసవి సెలవుల్లో చిత్రాన్ని విడుదల చేయటానికి సిద్ధపడుతున్నాం” అని సమర్పకులు మహేష్ కోనేరు తెలిపారు.

లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి  ప్రధాన నటులు. ఇతర నటీ నటులు వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు  సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీపి. సి. శ్రీరామ్ ,ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే – జయేంద్ర, శుభ,  దర్శకత్వం:  జయేంద్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here