నానికి బోర్ కొట్టేసిందట‌..!

Nani
వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు క‌దా.. అందుకే బోర్ కొట్టిందా అనుకుంటున్నారా..? అస‌లు విష‌యం మాత్రం అది కాదు. ఈయ‌న‌కు సినిమాలు లేక‌పోతే బోర్ కొడుతుంది. కాక‌పోతే చేస్తోన్న సినిమాల్లో కిక్ ఉండాలి క‌దా..! కెరీర్ మొద‌ట్నుంచీ దాదాపు కొత్త‌గా ఉండే క‌థ‌ల‌తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అంద‌రిలా రొటీన్ క‌థ‌లు కాకుండా కొత్త‌గా ట్రై చేసి స్టార్ అయ్యాడు. అయితే స్టార్ ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత నానిలో మార్పు వ‌చ్చింది. ఈ మ‌ధ్య మ‌నోడి నుంచి కూడా రొటీన్ క‌థ‌లు వ‌స్తున్నాయి. కాక‌పోతే అదృష్టం బాగుంది కాబ‌ట్టి అన్నీ విజ‌యం సాధిస్తున్నాయి. గ‌తేడాది వ‌చ్చిన నేనులోక‌ల్.. ఎంసిఏ లాంటి రొటీన్ క‌థ‌లు విజ‌యంతో పాటు విమ‌ర్శ‌ల‌ను కూడా తీసుకొచ్చాయి. ఎంసిఏ అయితే ఏకంగా 40 కోట్ల మార్క్ వైపు ప‌రుగులు తీస్తుంది. అయినా కానీ నాని లాంటి హీరో ఇలాంటి క‌థ‌లు చేయ‌డం ఏంటి అని అత‌డి అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇలా విమ‌ర్శ‌లు కూడా బాగానే వ‌స్తుండ‌టంతో వాటిని సీరియ‌స్ గా తీసుకున్నాడు నాని. ఇక‌పై కొత్త క‌థ‌లైతేనే చేస్తానంటున్నాడు. త‌న‌ను ఎగ్జైట్ చేసే క‌థ‌లేవీ రావ‌డం లేదంటున్నాడు నాని. ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమాకు మాత్ర‌మే క‌మిట‌య్యాడు నాని. ఈ చిత్రంతో పాటు నాగార్జున‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ అనుకుంటున్నాడు. శ్రీ‌రామ్ ఆదిత్య దీనికి ద‌ర్శ‌కుడు. కానీ క‌థ ఇప్ప‌టి వ‌ర‌కు పైన‌ల్ కాలేదు. మొత్తానికి కొత్త క‌థ ఉంటే త‌ప్ప‌.. మ‌రో సినిమాకు ఓకే చెప్పేది లేదంటున్నాడు నాని. మ‌రి ఈయ‌న మ‌దిని దోచే ఆ క‌థ ఎక్క‌డుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here