నాని అ..! నితిన్ అ..ఆ..! ర‌వితేజ అ..అ..అ..!


క‌ష్ట‌ప‌డి ఇప్పుడు మ‌న హీరోలు ప్రేక్ష‌కుల‌కు అ..ఆ..లు నేర్పిస్తున్నారు. టైటిల్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు ద‌ర్శ‌కులు. టైటిల్ బాగుంటే సినిమాపై ఆస‌క్తి పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు ఇదే చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొన్నామ‌ధ్యే అ..ఆ అంటూ త్రివిక్ర‌మ్ వ‌చ్చాడు. ఈ మ‌ధ్యే అ..! అంటూ నాని వ‌చ్చాడు. ఇప్పుడు ర‌వితేజ మ‌రో అ.. ఎక్కువ‌గా క‌లుపుకుంటున్నాడు. అ..అ..అ అంటూ ర‌వితేజ వ‌స్తున్నాడు. శీనువైట్ల‌తో ఈయ‌న చేస్తోన్న సినిమాకు అ క్యూబ్ అనే టైటిల్ పెట్టారు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అనేది పూర్తిపేరు. ఇందులో మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు ర‌వితేజ. అంటే ట్రిపుల్ రోల్ చేస్తున్నాడ‌న్న‌మాట‌. ఈ మ‌ధ్య కాలంలో ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌లో మూడు పాత్ర‌ల్లో జీవించాడు. ఇప్పుడు ర‌వితేజ ఇది చేస్తున్నాడు. ఈ చిత్ర ఓపెనింగ్ మార్చ్ 8న జ‌రిగింది.
మిస్ట‌ర్ ఫ్లాప్ తో క‌నిపించ‌డ‌మే మానేసాడు శీనువైట్ల‌. అస‌లు ఈ ద‌ర్శ‌కుడొక‌రు ఉన్నార‌నే సంగ‌తి కూడా ఇండ‌స్ట్రీ మ‌రిచిపోయింది. హిట్ల‌లో ఉన్న‌పుడే ద‌ర్శ‌కుడికి విలువ‌. కానీ ఏం చేస్తాం.. శీనువైట్ల మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. దాంతో మ‌నోడి వైపు ఏ హీరో క‌నీసం చూడ‌ట్లేదు కూడా ఇప్పుడు. అందుకే మ‌ళ్లీ మొద‌ట్నుంచీ మొద‌లుపెడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు తాను లైఫ్ ఇచ్చిన ర‌వితేజ‌నే ఇప్పుడు త‌న లైఫ్ కోసం వాడుకోవాల‌ని చూస్తున్నాడు. అత‌డి ద‌గ్గరికే వెళ్తున్నాడు శీనువైట్ల‌. ఇప్ప‌టికే ఈయ‌న చెప్పిన లైన్ ర‌వితేజ‌కు న‌చ్చి సినిమా చేస్తున్నాడు. ఇక్క‌డ చిన్న మెలిక కూడా ఉంది. ఇప్పుడు శీనువైట్ల‌ను న‌మ్మి కోట్లు పెట్టే నిర్మాత‌లు అరుదు. అందుకే త‌నతో పాటు ర‌వితేజ కూడా రెమ్యున‌రేష‌న్ లేకుండానే ఈ చిత్రం చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.
అలా అయితే గానీ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రం నిర్మించ‌మ‌ని తెగేసి చెప్పార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాను చాలా త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్తి చేసి.. విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో షేర్ తీసుకోవాల‌ని చూస్తున్నారు శీనువైట్ల‌.. ర‌వితేజ‌. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ సినిమాతో బిజీగా ఉన్న మాస్ రాజా.. ఎప్రిల్ నుంచి శీనువైట్ల సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఆ లోపు తాను క‌మిటైన సినిమాలు పూర్తి చేయ‌బోతున్నాడు ర‌వితేజ‌. మొత్తానికి ఒక‌ప్పుడు సినిమాకు 10 కోట్లకు పైగా తీసుకున్న శీనువైట్ల‌.. ఇప్పుడు ఫ్రీగా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అదే మ‌రి విధి వైప‌రిత్యం అంటే..! మ‌రి ఈ సినిమాతోనైనా శీనువైట్ల ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here