నాని అ..! విధంగా వాడుకున్నాడా..?


ప్ర‌మోష‌న్ చేసుకోవాలంటే నాని త‌ర్వాతే ఎవ‌రైనా..! త‌న సినిమాల‌తో పాటు ఇప్పుడు తాను హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ 2ను కూడా త‌న‌దైన శైలిలో ప్ర‌మోట్ చేస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఈ మ‌ధ్యే నిర్మాత‌గా మారి అ.. అనే విభిన్న సినిమా ఒక‌టి తీసాడు నాని. ఇప్పుడు ఇదే సినిమాను బిగ్ బాస్ ప్ర‌మోషన్ కోసం వాడుకుంటున్నాడు నాని. అందులో చేప‌గా న‌టించాడు ఈ హీరో. ఇప్పుడు ఎన్నో చేప‌ల్ని అక్వేరియంలో పెట్టి.. ఈ లోకంలో ఎన్నో ర‌కాల మ‌నుషులు ఉంటారు.. కొంద‌రు న‌వ్వుతారు.. కొంద‌రు ఏడుస్తారు.. కొంద‌రు నిల‌బ‌డ‌తారు.. కొంద‌రు క‌ల‌బ‌డ‌తారు.. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలియ‌దు. వాళ్లంద‌రి పైన ఇంకొక‌డు ఉంటాడు.. వాడెవ‌డో తెలుసా.. అంటూ నాని అదర‌గొట్టాడు. ఈ ప్రోమోతో బిగ్ బాస్ 2పై ఆస‌క్తి ఇంకా పెరిగిపోయింది. జూన్ 10 నుంచి షో మొద‌లు కానుంది. 100 రోజుల పాటు సాగే ఈ కార్య‌క్ర‌మంలో 16 మంది సెలెబ్రెటీస్ పాల్గొంటారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఎన్టీఆర్ చేసిన‌ట్లుగా నాని చేస్తాడా.. అత‌న్ని మ‌రిపిస్తాడా..? అది అయితే క‌చ్చితంగా అంత ఈజీ కాదు.. మ‌రి యంగ్ టైగ‌ర్ ఏం చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here