నాని గ్యారేజ్.. ఫ్లాప్ ద‌ర్శ‌కులు కావ‌లెను..!

Nagarjuna Nani
చూస్తుంటే ఇప్పుడు ఇదే నిజం అనిపిస్తుంది మ‌రి. కొన్నేళ్ళుగా నాని వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. అందులో హిట్ల‌లో ఉన్న ద‌ర్శ‌కు ల‌తో చేసింది త‌క్కువే. క‌థ‌ల‌ను న‌మ్మి ముందుకెళ్తున్నాడు న్యాచుల‌ర్ స్టార్. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుంచి నాని జైత్ర‌యాత్ర మొద‌లైంది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కు అదే తొలి సినిమా. ఇక భ‌లేభ‌లే మ‌గాడివోయ్ కంటే ముందు మారుతికి కొత్త‌జంట పెద్ద‌గా ఆడ‌లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ కంటే ముందు హ‌నుకు అందాల రాక్ష‌సి లాంటి ప‌రాజ‌యం ఉంది. జెంటిల్ మ‌న్ కు ముందు ఇంద్ర‌గంటి హిట్ అనే మాటే మ‌రిచిపోయి చాలా కాల‌మైంది. నిన్నుకోరి ద‌ర్శ‌కుడు శివ‌నిర్వానకు కూడా ఇదే తొలి సినిమా. ఇక రీసెంట్ గా వ‌చ్చిన ఎంసిఏ ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు తొలి సినిమా ఓ మై ఫ్రెండ్ డిజాస్ట‌ర్. ఇలా వ‌ర‌స‌గా ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుల‌కు ఆఫ‌ర్లు ఇస్తూ వాళ్ల‌కు లైఫ్ ఇస్తున్నాడు.. త‌ను విజ‌యాలు అందుకుంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్.
ఇప్పుడు ఇదే కోవ‌లోకి మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు చేరిపోయారు. ఇప్ప‌టికే శ్రీ‌రామ్ ఆదిత్యతో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు నాని. ఈ చిత్రానికి ముందు శ‌మంత‌క‌మ‌ణి క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్. కానీ ఆదిత్య చెప్పిన‌ క‌థ నానికి న‌చ్చింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దాన్ని ఫైన‌ల్ మాత్రం చేయ‌లేదు నాని. నాగార్జున ఈ చిత్రంలో మ‌రో హీరో. ఇది ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిన‌ట్లే కానీ కాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. ఇక ఇప్పుడు కిషోర్ తిరుమ‌ల‌తోనూ ఓ సినిమా క‌న్ఫ‌ర్మ్ చేసాడు నాని. ఈ చిత్రం మార్చ్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. కృష్ణార్జున యుద్ధం త‌ర్వాత ఇమ్మీడియట్ గా నాని మొద‌లుపెట్టే సినిమా ఇదే. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీతో కిషోర్ ఈ మ‌ధ్యే ఫ్లాప్ ఇచ్చాడు. మొత్తానికి నాని గ్యారేజ్ బాగానే ర‌న్ అవుతుందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here