నాని.. మ‌రో నాలుగు క‌న్ఫ‌ర్మ్ చేసాడు..!

Nani
దేవుడా.. ఏం దూకుడు తెలియ‌దు కానీ నాని మాత్రం చంపేస్తున్నాడు. అస‌లు ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో.. డేట్స్ ఎలా ఇస్తున్నాడో తెలియ‌ట్లేదు.. ఈయ‌న దూకుడు చూసి మిగిలిన హీరోలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడాదంతా క‌ష్ట‌ప‌డినా కూడా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండ‌టం త‌న‌కు ఇష్టం లేదంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. అందుకే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు ఈజీగా చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా కృష్ణార్జున యుద్ధం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. దాంతో అప్పుడే మ‌రో మూడు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు నాని. ప్ర‌స్తుతం న‌టిస్తున్న కృష్ణార్జున యుద్ధం పూర్తి కాగానే శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌తో చేయ‌బోయే సినిమాను ఫిబ్ర‌వ‌రి 23న మొద‌లు పెట్ట‌నున్నాడు నాని. ఈ చిత్ర కథ‌పై మొన్న‌టి వ‌ర‌కు అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ తీరిపోయాయ‌ని క్లారిటీ ఇచ్చాడు న్యాచుర‌ల్ స్టార్.
ఈ సినిమాకు అచ్చమైన‌ తెలుగు టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు శ్రీ‌రామ్. అశ్వినీద‌త్ నిర్మాత‌. ఇక ఈ రెండు సినిమాలు ఇలా ఉండ‌గానే మ‌రో రెండు సినిమాల‌కు కూడా క్లారిటీ ఇచ్చాడు నాని. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ లాంటి సినిమా త‌న‌కు ఇచ్చిన హ‌ను రాఘ‌వ‌పూడితో ఓ సినిమా చేయ‌నున్నాడు నాని. దాంతోపాటే విక్ర‌మ్ కే కుమార్ తోనూ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు నాని. ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాది మొద‌లు కానున్నాయ‌ని చెప్ప‌డం మ‌రో విశేషం. కృష్ణార్జున యుద్ధం.. నాగార్జున‌తో మ‌ల్టీస్టార‌ర్.. హ‌ను.. విక్ర‌మ్.. ఇలా వ‌ర‌స‌గా నాలుగు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు నాని.
ఇన్ని సినిమాలు లైన్ లో ఉండ‌గానే కిషోర్ తిరుమ‌ల‌తోనూ ఓ సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ క‌థ‌పైనే ఉన్నాడు కిషోర్. ఈ మ‌ధ్యే ఈయ‌న తెర‌కెక్కించిన ఉన్న‌ది ఒకటే జింద‌గీ ఆడ‌లేదు. అయినా కానీ సినిమాకు మంచి పేరొచ్చింది. దాంతో కిషోర్ చెప్పిన క‌థ‌కు క‌నెక్ట్ అయిపోయాడు నాని. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. మొత్తానికి ఒక‌టి రెండు సినిమాలు చేయ‌డానికే చ‌చ్చిపోతున్న ఈ రోజుల్లో.. ఒక‌టి సెట్స్ పైకి తీసుకొచ్చి మ‌రో నాలుగు సినిమాలు లైన్ లో పెడుతున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఎంతైనా ఈయ‌న గ్రేట్ అంతే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here