నారా రోహిత్, జగపతిబాబుల ‘ఆటగాళ్లు’ ఫస్ట్ లుక్ విడుదల

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నారా రోహిత్, జగపతిబాబు ప్రదానపాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను శుక్రవారం సాయంత్రం గ్రీన్ పార్క్ హొటల్ లో హీరో నారా రోహిత్ మరియు జగపతిబాబు విడుదల చేశారు.. ఈ సందర్భంగా నిర్మాత వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి..

త్వరలో ఆడియో, మరియు ట్రైలర్ లను విడుదల చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. డైరెక్టర్ పరుచూరి మురళి మాట్లాడుతూ.. పెద్దబాబు చిత్రం తరువాత జగపతిబాబు గారితో చేస్తున్న చిత్రం ఇది. మొదట ఈ సబ్జెక్ట్ నేను చేయను అన్నారు కానీ నేను పట్టుపట్టడంతో ఇంకొకరిని ఎవరినైనా లీడ్ గా తీసుకురా చేద్దాం అన్నారు.. అప్పుడు నారా రోహిత్ గారైతే పర్ఫెక్ట్ అనిపించింది.. కానీ అతను కూడా చేయను అన్నారు తరువాత అంగీకరించారు.. అంతేకాకుండా నీకు ఎలా కావాలో అలానే చెయ్యి అని ఫ్రీడమ్ కూడా ఇచ్చారు అందుకు ఇద్దరి హీరోలకు నా కృతజ్ఞతలు.

ఇక ఈ చిత్రానికి నిర్మాతలు ముగ్గురు నా స్నేహితులు వీరు కాకుండా మరొకరైతే గొడవలు వచ్చేవి. సినిమా ఇలా పూర్తయ్యేది కాదు.. సినిమా కోసం ఎంతైనా చేద్దాం అన్నారు.. వీళ్ళతో పాటు నేను కూడా నిర్మాతగా మారాను. ప్రతి టెక్నీషియన్ కష్టమే ఈ ఆటగాళ్లు చిత్రం అతి త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నటుడు జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ కథ మురళి తీసుకువచ్చినప్పుడు నేను హీరోకు సరిపోను.. మార్కెట్ కూడా లేదు నాకు.. విలన్ గా అయితే ఉందని చెప్పి పంపాను కానీ మురళి వదలకుండా పట్టు పట్టాడు.. నారా రోహిత్ ను ఒకే చేసుకొని వచ్చాడు.. అప్పుడు అంగీకరిచాను.. ఈ చిత్ర నిర్మాతలు చాలా మంచోళ్ళు..

డబ్బు కోసం సినిమా చేయలేదు కేవలం స్నేహం కోసం మాత్రమే చేశారు.. ఇక ఈ సినిమాలో రోహిత్ చేసిన పాత్ర ను చేయడానికి ఎవరూ సాహసించరు.. ఆర్జీవి లా ఉంటుంది తన క్యారెక్టరైజేషన్. కథను నమ్మి సినిమా చేయడానికి అంగీకరించిన రోహిత్ ను అభినందించాలి అన్నారు.. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. మురళి నాకు రెండు కథలు చెప్పాడు మొదట ఆటగాళ్లు.. రెండోది మరొకటి అయితే నేను విన్న తరువాత మొదటిది చేయను రెండో కథ ఒకే అని చెప్పా.. కానీ మురళి వినలేదు.. మళ్లీ వారానికి వచ్చి ఏదో గేమ్ ప్లే చేసి నన్ను ఒప్పించుకున్నాడు…

నేను చాలా జానర్స్ చేసాను కానీ ఇలాంటి డిఫరెంట్ జోనర్ చేయడం మొదటిసారి.. నా పాత్ర నాకే కొత్తగా అనిపించింది. జగపతిబాబు గారితో మొదటి సారి కలసి పనిచేస్తున్నా.. అందరి మంచి ప్రయత్నమే ఆటగాళ్లు చిత్రం తప్పకుండా మంచి పేరు తీసుకు వస్తుందని నమ్ముతున్నా అన్నారు..

సాయి కార్తీక్, ఫణి లతో పాటు ఇతర నిర్మాతలు, టెక్నీషియన్స్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నారా రోహిత్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్, సుబ్బరాజు, శ్రీతేజ్, చలపతిరావు, నాగినీడు, ప్రియ, ఫణి సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, ఎడిటింగ్: మార్తాండ్, కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విజయ్, సి. కుమార్, ఆర్ట్: ఆర్ కె రెడ్డి, డైలాగ్స్: గోపి, కొరియోగ్రాఫీ: శ్రీ, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసి రెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర, స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: పరుచూరి మురళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here