నా నువ్వే ఫ‌స్ట్ టాక్ ఏంటి..?

NAA NUVVE PREVIEW

క‌ళ్యాణ్ రామ్, త‌మ‌న్నా జంట‌గా జ‌యేంద్ర తెర‌కెక్కించిన నా నువ్వే విడుద‌లైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 14న వ‌చ్చేసింది ఈ చిత్రం. ఓవ‌ర్సీస్ లో ఒక రోజు ముందే ప్రీమియ‌ర్ షోలు ప‌డ్డాయి. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఎక్కువ‌గా 130 లొకేష‌న్స్ లో షోస్ ప‌డ‌టం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన టాక్ ప్ర‌కారం అయితే నా నువ్వే బ్లాక్ బ‌స్ట‌ర్ కంటెంట్ అయితే కాదు. డెస్టినీని బేస్ చేసుకుని జ‌యేంద్ర రాసుకున్న క‌థ ఇది. అనుకోకుండా ఇద్ద‌రు క‌ల‌వ‌డం..

ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాళ్ల క‌ల‌యిక‌ను డెస్టినీ డిసైడ్ చేయ‌డం అనేది విక్ర‌మ్ కే కుమార్ హ‌లోలో చూసాం. ఇలాంటి ఓ క‌థ‌నే మ‌ళ్లీ నా నువ్వే లోనూ చూపించాడు జ‌యేంద్ర‌. అయితే స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకునేలా లేకపోవ‌డంతో నా నువ్వే కాస్త డ‌ల్ గా ఉంద‌ని తెలుస్తుంది.

ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ను కొత్త‌గా చూడ్డానికి అయితే ఓకే కానీ ప్రేక్ష‌కుల‌కు మాత్రం కొత్త‌గా చూడ్డానికి ఏమీ లేద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. త‌మ‌న్నా అయితే త‌న అందంతో మ‌తులు చెడ‌గొట్టేసింది. అస‌లు ఈ మ‌ధ్య కాలంలో త‌మ్మూ ఇంత‌గా రెచ్చిపోయింది లేదు. క‌ళ్యాణ్ రామ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. మొత్తానికి నా నువ్వేతో క‌ళ్యాణ్ రామ్ కొత్త‌గా ట్రై చేసాడు. మ‌రి అది ప్రేక్ష‌కులు ఎంత వ‌ర‌కు రిసీవ్ చేసుకుంటార‌నేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here