నా పేరు సూర్య‌ను వాళ్లు ఫ్లాప్ చేస్తారు..


ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. స్వ‌యానా అల్లు అర్జున్ నాన్న‌.. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్. వేలాది మంది అభిమానుల సాక్షిగా అల్లు అర‌వింద్ అన్న మాటిది. సినిమా విడుద‌ల‌వ్వ‌క ముందే.. అది కూడా కొడుకు సినిమాపై ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో అంతా ఒక్క‌సారి ఇలా షాక్ అయిపోయారు.
కావాల‌నే కొంద‌రు నా పేరు సూర్య‌పై బుర‌ద జ‌ల్ల‌డానికి రెడీగా ఉన్నార‌ని.. ఇది మంచి సినిమా అని.. ఓ హానెస్ట్ అటెంప్ట్ చేసార‌ని చెప్పాడు ఈ నిర్మాత‌. కానీ ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో జ‌రిగిన కొన్ని డిస్ట‌ర్బెన్సెస్ అంద‌రికీ తెలిసిందే అని.. తొలిరోజు విడుద‌ల కాగానే దీనికి మిక్స్ డ్ టాక్ తీసుకొచ్చి.. ప్రేక్ష‌కుల‌కు చేరువ కాకుండా చేయాల‌ని ఇప్ప‌టికే తెర‌వెన‌క కొన్ని శ‌క్తులు ప‌ని చేస్తున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు అల్లు అర‌వింద్.
దీన్నిబ‌ట్టి చూస్తుంటే కొన్ని మీడియా సంస్థ‌ల‌పై ఇండ‌స్ట్రీ ఉక్కుపాదం మోపేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే ఎవ‌రికి న‌ష్టం.. ఎవ‌రికి లాభం అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఏది ఏమైనా అల్లు అర‌వింద్ మాట‌లు మాత్రం కొంద‌రికి బాగానే షాక్ ఇచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here