నితిన్ పెళ్లి డేట్ మారిందోచ్..


అవును మ‌రి పెళ్లి అన్న త‌ర్వాత స‌వాల‌క్ష మార్పులు ఉంటాయి. ఏదీ అనుకున్న‌ట్లు అవ్వ‌దు. కొన్నిసార్లు అడ్డంకులు కూడా వ‌స్తుంటాయి. అన్నింటినీ దాటుకుంటూ వెళ్తేనే పెళ్లి స‌జావుగా సాగుతుంది. ఇప్పుడు నితిన్ పెళ్లి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఊహించ‌నంత వేగంగా త‌న పెళ్లి ప‌నులు పూర్తి చేసుకుంటున్నాడు నితిన్. మ‌రో విష‌యం ప‌ట్టించుకోకుండా కేవ‌లం క‌ళ్యాణంపైనే ఫోక‌స్ చేసాడు.
మార్చ్ లోనే పెళ్లి ప‌నులు కూడా మొద‌లైపోయాయి. అయితే ఇదంతా నిజం పెళ్లి కోసం కాదు లెండీ..! రీల్ లైఫ్ పెళ్లి కోస‌మే. ఈయ‌న న‌టిస్తున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తైంది. గోదావ‌రి జిల్లాల్లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ అయిపోయింది. శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడు. ఇప్పుడు చండీఘ‌ర్ లో శ్రీ‌నివాస క‌ళ్యాణం రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది.
అక్క‌డే కొన్ని రోజులుగా షూటింగ్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి త‌గ్గ‌ట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు స‌తీష్ వేగేశ్న‌. శ్రీ గా రాశీ.. నివాస్ గా నితిన్ న‌టిస్తున్నారు. ఈ శ్రీ‌నివాస్ ల క‌ళ్యాణ‌మే శ్రీ‌నివాస క‌ళ్యాణం. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత స‌తీష్ చేస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. శ‌త‌మానం భ‌వ‌తిని 47 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్తించిన స‌తీష్ వేగేశ్న‌.. ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణంను కూడా ఇదే చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని కూడా 50 రోజుల్లోపే పూర్తి చేయాల‌నేది ఈ ద‌ర్శ‌కుడి ప్లాన్. దీనికి త‌గ్గ‌ట్లే అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. గ‌తేడాది వ‌చ్చిన లైతో పాటు మొన్నొచ్చిన ఛల్ మోహ‌న్ రంగా కూడా డిజాస్ట‌రే. మొత్తానికి ఆగ‌స్ట్ లో నితిన్ పెళ్లి ఘ‌నంగా జ‌రుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here