నెక్ట్స్ లెక్క ఎక్క‌డ వ‌క్కంతం..?


వ‌క్కంతం వంశీ.. స‌రిగ్గా ప‌ది రోజుల కింద ఈయ‌నేదో అద్భుతం చేస్తాడు.. 23 ఏళ్ల ద‌ర్శ‌క‌త్వం క‌ల నెర‌వేర‌డంతో క‌చ్చితంగా నా పేరు సూర్య‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాడేమో అనుకున్నారంతా. కానీ సీన్ అంతా రివ‌ర్స్ అయిపోయింది. సినిమా అనుకున్నంత‌గా లేద‌ని తొలిరోజే టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. దాంతో వ‌క్కంతం వంశీ క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి. తొలివారంలో కేవ‌లం 46 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసి.. భారీ న‌ష్టాల దిశ‌గా అడుగేస్తుంది నా పేరు సూర్య‌.
ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 50 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. మ‌రోవైపు సేఫ్ అవ్వాలంటే 80 కోట్లు రావాలి. అది క‌లే.. అందుకే వ‌క్కంతం వంశీకి విజ‌యం కూడా ఇప్పుడు క‌లే. అయితే ఈయ‌న రెండో సినిమాపై ఇప్పుడు అంద‌రి ఆస‌క్తి ఉంది. నా పేరు సూర్య ఫ‌లితం చూసిన త‌ర్వాత ఏ హీరో అయినా వంశీకి ఆఫ‌ర్ ఇచ్చే దైర్యం చేస్తాడా అనేది అస‌లు అనుమానం. క‌చ్చితంగా ఇప్ప‌ట్లో వ‌క్కంతం మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఈయ‌న రెండో సినిమా కోసం మ‌రోసారి పోరాటం మొద‌లుపెట్టాల్సిందే. స్టార్ హీరోల కంటే చిన్న హీరోల‌ను న‌మ్ముకుంటే ప‌ని అవుతుంద‌ని స‌ల‌హాలు కూడా వంశీకి వెళ్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. వీటిని ఈ ద‌ర్శ‌కుడు ఎంత‌వ‌ర‌కు తీసుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here