నెట్టింట్లో స‌న్నీలియోన్ జీవితం.. 

మ‌న దేశం కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఎక్క‌డో కెన‌డా నుంచి వ‌చ్చింది.. ఇక్క‌డ తిష్ట వేసింది.. కాదు కాదు.. కుర్రాళ్ల గుండెల్లో బెడ్ వేసుకుని మ‌రీ ప‌డుకుంది. ఆ భామే స‌న్నీలియోన్. ఇప్పుడు ఇండియాలో ఈ పేరుకు ఓ చ‌రిత్ర ఉంది. పోర్న్ సైడ్ నుంచి వ‌చ్చినా ఈమెను శృంగార దేవ‌త‌గా అభిమానిస్తున్నారు. స‌న్నీలియోన్ ఉంటే చాలు త‌మ సినిమాల‌కు కాసులు ఖాయం అనే న‌మ్మ‌కంతో ఉంటున్నారు నిర్మాత‌లు. పాపం.. స‌న్నీ కూడా వాళ్ల న‌మ్మ‌కాన్ని ఎప్పుడూ వమ్ము చేయ‌లేదు. తాను చేయాల్సిందంతా చేస్తూనే ఉంది. ఈమె ఇమేజ్ ను తెలుగులో కూడా వాడేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇంత ఫేమ‌స్ ప‌ర్సినాలిటీ జీవితం గురించి తెలుసుకోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి.. ఈ ఎగ్జైట్ మెంట్ ను క్యాష్ చేసుకోడానికి ఇప్పుడు స‌న్నీలియోన్ జీవితాన్ని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్ట‌నున్నారు. క‌ర‌ణ్ జీత్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుందిప్పుడు. భారీ బ‌డ్జెట్ తోనే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నారు. జీ 5లో ఇది ప్ర‌సారం కానుంది. క‌ర‌ణ్ జీత్ టైటిల్ పెట్ట‌డం వెన‌క కార‌ణం కూడా ఉంది. స‌న్నీలియోన్ అస‌లు పేరు క‌ర‌ణ్ జీత్. అందుకే ఈ టైటిల్ పెట్టారు దీనికి. త‌న జీవితంలోని అతి ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోవాల‌న్నా.. తాను కెన‌డా నుంచి ఇండియాకు ఎందుకు వ‌చ్చానో తెలుసుకోవాల‌నుకున్నా కూడా క‌ర‌ణ్ జీత్ వెబ్ సిరీస్ చూడండంటూ స‌న్నీనే త‌న వెబ్ సిరీస్ ను ప్ర‌మోట్ చేస్తుంది. దీనికోసం ఈ భామ‌కు భారీ పారితోషికం ఇచ్చారు. మొత్తానికి రెండు చేతులా కాదు.. రెండు కాళ్లా కూడా సంపాదించ‌డమంటే ఇదే మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here