నేల‌పై ప‌డుకున్న నేల‌టికెట్ పిల్ల‌..


టైటిల్ కు ప‌క్కా న్యాయం చేస్తుంది నేల‌టికెట్ పిల్ల మాళ‌విక శ‌ర్మ‌. ఏదో సినిమా టైటిల్ అనుకుంటే.. ఇప్పుడు తాను కూడా నేల‌పై ప‌డుకుని పోజులు ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అరాచ‌కం చూస్తుంటే ఇక్క‌డే తిష్ట వేసేలా క‌నిపిస్తుంది కానీ వెళ్లేలా మాత్రం లేదు. ఏదైనా స‌రే తెలుగులోనే త‌న కెరీర్ అంటూ పెట్టే బేలా స‌ర్దుకుని ముంబై నుంచి వ‌చ్చేసింది మాళ‌విక శ‌ర్మ‌.
దానికి త‌గ్గ‌ట్లే తొలి సినిమాలోనే అందాల‌న్నీ ఆర‌బోసి.. తాను దేనికైనా సిద్ధం అనే సంకేతాలు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పంపింది. ఇక ఇప్పుడు సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తుంది. ఇప్ప‌టికే నేల‌టికెట్ లో అమ్మాయిగారి ర‌చ్చ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ చిత్రం కానీ ఆడితే క‌చ్చితంగా మాళ‌విక ఇక్క‌డే సెటిల్ అయిపోవ‌డం ఖాయం. తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్ ఒక‌టి విడుద‌లైంది.
ఇందులో న‌డుము అందాల‌న్ని విచ్చ‌ల‌విడిగా ఆర‌బోసింది. ఇది చూసి వామ్మో.. పాప చాలా హాట్ గురు అనుకున్నారు. మొన్న ఆడియో వేడుక‌లో కూడా అమ్మాయిగారి ర‌చ్చ మామూలుగా లేదు. యాడ్స్ తో టీవీల్లో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు సినిమాల్లోకి వ‌చ్చేస్తుంది. ర‌వితేజ లాంటి స్టార్ హీరో సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది మాళ‌విక‌. మ‌రి ఈ భామ జాత‌కం ఎలా ఉండ‌బోతుందో మ‌రో మూడు రోజుల్లో తేల‌బోతుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here