పాపం.. ర‌కుల్ క‌ష్టాలు చూడండి..!

అన్నీ ద‌గ్గ‌రే ఉన్న‌పుడు దాని విలువ తెలియ‌దు. ఒక్క‌సారి దూరం అయిన త‌ర్వాత కానీ అస‌లు క‌ష్టాల‌న్నీ ముందు క‌నిపిస్తాయి. ఇప్పుడు రకుల్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న‌పుడే బాలీవుడ్ కు వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ అయ్యారీలో న‌టించి షాక్ తినేసింది ర‌కుల్. ఇక ఆ త‌ర్వాత వెంట‌నే మ‌ళ్ళీ ఛ‌లో సౌత్ అంటూ వ‌చ్చేసింది ఈ భామ‌.

ఇప్పుడు త‌మిళ్ లో మూడు సినిమాలు చేస్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్. కానీ తెలుగులో మాత్రం అవ‌కాశాలు రావ‌డం లేదు. దానికి కార‌ణం కూడా ఇప్పుడు ఆమెకు తెలియ‌డం లేదు. కొత్త హీరోయిన్లు వ‌చ్చేయ‌డంతో ఇప్పుడు ర‌కుల్ పాత స‌రుకు అయిపోయింది. దాంతో క‌నీసం ఐటం గాళ్ గా అయినా రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తుంది ర‌కుల్. కానీ ఆ ఛాన్స్ కూడా ఇప్పుడు వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు.

త‌న‌కు అచ్చొచ్చిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను.. క‌లిసొచ్చిన హీరో రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ఐటం సాంగ్ చేయ‌డానికి ర‌కుల్ రెడీ అవుతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఇది కూడా అబ‌ద్ధం అంటున్నారు చిత్ర‌యూనిట్. తాము ర‌కుల్ ను అస్స‌లు సంప్ర‌దించ‌లేదంటున్నారు. మ‌రి ఇలాంటి టైమ్ లో తెలుగులో ర‌కుల్ రీ ఎంట్రీకి స‌రైన ఎంట్రీ ఎప్పుడు దొరుకుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here