పాపం.. ర‌కుల్ త‌గ్గించ‌క త‌ప్ప‌ట్లేదు.. 

Rakul In Talks FOr Natural Star's Multi Starrer
ఇండ‌స్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో..! సినిమా సినిమాకు వాళ్ల రేంజ్ మారిపోతుంది. హిట్ వ‌స్తే పైకి.. లేక‌పోతే కింద‌కి..! రెండేళ్లుగా ర‌కుల్ కెరీర్ పైపైకి వెళ్లిపోతుంది. ఇప్పుడు కింద‌కి వ‌స్తుంది. దానికి కార‌ణం వ‌ర‌స ప‌రాజ‌యాలే. ఇప్ప‌టికే తెలుగులో స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించింది ర‌కుల్. ప్ర‌భాస్, ప‌వ‌న్ త‌ప్ప‌. వాళ్లు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చేలా కూడా క‌నిపించ‌ట్లేదు. దానికితోడు బాలీవుడ్ లో జెండా పాతేద్దాం అని వెళ్లి.. అక్క‌డ అయ్యారీతో అయ్యారే అంటూ నోరు తెరుచుకుని రిట‌ర్న్ ట్రైన్ ఎక్కేసింది ఈ భామ‌. ఇప్పుడు త‌మిళ‌నాట బాగా దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ సూర్య‌తో ఎన్ జి కే సినిమాలో న‌టిస్తుంది. సెల్వ దీనికి ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రంతో పాటు ఇప్ప‌టికే శివ‌కార్తికేయ‌న్ తో ఓ సినిమా.. కార్తితో మ‌రో సినిమా సైన్ చేసింది. ఈ రెండు సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్ బాగా త‌గ్గించేసుకుంది ర‌కుల్. ఇప్పుడు అంత‌కంటే ఆప్ష‌న్ కూడా లేదు ఈ భామ‌కు. త‌మిళ‌నాట సెటిల్ అవ్వాలంటే రేట్ లో రిబేట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు. ఒక్క‌సారి అక్క‌డ క్లిక్ అయితే స్టార్ హీరోలంతా ఆఫ‌ర్లు ఇస్తుంటారు. గ‌తంలో హ‌న్సిక‌, త‌మ‌న్నా లాంటి ముద్దుగుమ్మ‌ల విష‌యంలో ఇదే జ‌రిగింది. ర‌కుల్ ఇప్పుడిప్పుడే త‌మిళ‌నాట అడుగు పెడుతుంది. మ‌రి ఈ భామ జాత‌కం ఎలా ఉండ‌బోతుందో..? అందుకే ముందు జాగ్ర‌త్త‌గా రేట్ విష‌యంలో అందుబాటులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here