పాప పెళ్లి కూతురు అవుతుంది..


ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ప్రేమించుకుంటే పెళ్లి చేసుకునే వ‌ర‌కు కూడా టెన్ష‌న్ ఉండేది. ఎప్పుడు విడిపోయేది తెలియ‌దు. కానీ ఇప్పుడు కాలం మారు తుంది. ప్రేమిస్తే క‌చ్చితంగా పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మ‌రో ముద్దుగుమ్మ కూడా ఇలాగే పెళ్లి పీట‌లెక్క‌డానికి రెడీ అవుతుంది. ఆ భామ ఎవ‌రో కాదు.. శ్వేత‌బ‌సుప్ర‌సాద్. ఎ..క‌..డా అంటూ కొత్త‌బంగారులోకంలో అంద‌ర్నీ అల‌రించిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత మ‌రో విధంగా ఫేమ‌స్ అయిపోయింది. అప్ప‌ట్లో ఓ ఛానెల్ చేసిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో ఈ భామ దొరికిపోయింది. ఆ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి దూరం అయిన శ్వేత‌..
మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అమేజ‌న్ ప్రైమ్ వీడియోస్ లో వ‌స్తున్న గ్యాంగ్ స్టార్స్ లో న‌టించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్ ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంది ఈ భామ‌. ఇప్ప‌టికే వీళ్లు ప్రేమ‌లో ప‌డి నాలుగేళ్లు అవుతుంది. ఈ ఇద్ద‌ర్ని క‌లిపింది కూడా మ‌రో ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్. ఈయ‌న చ‌లువతోనే ఇరు కుటుంబాల్లో శ్వేత ప్రేమ స‌క్సెస్ అయింది. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. త‌న పెళ్లి విష‌యంపై ఇన్నాళ్లూ సైలెంట్ గానే ఉన్న శ్వేత ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అవును.. త్వ‌ర‌లోనే జంట కాబోతున్నానంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here