పిల్ల మ‌ళ్లీ చంపేసిందిగా..


కృతిక‌ర్భందా.. పేరుతో పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేద‌నుకుంటా. తెలుగులో ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా న‌టించింది ఈ భామ‌. కానీ అదృష్ట‌మే క‌లిసిరాలేదు. అయితే ఇండ‌స్ట్రీలో త‌న‌దైన రోజు కోసం ఇప్ప‌టికీ వేచి చూస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. చివ‌రి వ‌ర‌కు ఓటమి ఒప్పుకోకని ఎవ‌రో మ‌హానుభావుడు చెప్పిన‌ట్లుగా ఇదే ఫాలో అవుతుంది కృతి. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ దండం పెట్టి పంపినా.. బాలీవుడ్ లో అదృష్టం ప‌రీక్షించుకుంటుంది ఈ భామ‌. ఎనిమిదేళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కృతిక‌ర్భందా..
ఇప్ప‌టికీ ఉనికి కోసం పోరాడుతూనే ఉంది. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ భామ జాత‌కం మార్చ‌లేదు. దాంతో ఇప్పుడు కృతి ముందున్న ఏకైక ల‌క్ష్యం అందాల ఆర‌బోత‌. గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. ఇప్ప‌టికీ హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇప్ప‌టికీ హాట్ ఫోటోషూట్ల‌తో ర‌ప్ఫాడిస్తుంది కృతి.
ఓ వైపు అక్క పాత్ర‌లు చేస్తూనే మ‌రో వైపు హీరోయిన్ రోల్స్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు కృతి క‌ర్బందా. ఆ మ‌ధ్య ఓ హాట్ ఫోటోషూట్ తో తానింకా హీరోయిన్ మెటీరియ‌ల్ నే అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఓ హింట్ వ‌దిలేసింది కృతి. ఆ త‌ర్వాతే బాలీవుడ్ లో రాజ్ 4 సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీ, గౌర‌వ్ అరోరాల‌తో రొమాన్స్ చేసింది. ఈ సినిమాలో అయితే ఏకంగా హాట్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది.
అయినా అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. రాజ్ 4 ఫ్లాప్ తో కృతి జాత‌కం మార‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కిణిలా మారిపోయింది కృతిక‌ర్భందా. ఈ మ‌ధ్యే రాజ్ కుమార్ రావ్ తో క‌లిసి న‌టించిన షాదీ మే జ‌రూర్ ఆనా సినిమాలోనూ ముద్దుల‌తో ముంచెత్తింది. మొన్న‌టికి మొన్న వీరి కి వెడ్డింగ్ లోనూ గ్లామ‌ర్ షోతో చంపేసింది కృతి. ఏ ఈవెంట్ కు వ‌చ్చినా ఉల్లిపొర కంటే ప‌లుచ‌గా ఉండే దుస్తుల్లో క‌నిపిస్తుంది. వాటికితోడు ఇలా ఫోటోషూట్ల‌తో ప్రాణం తీస్తుంది కృతిక‌ర్బందా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here