పూరీ ఇంకా మార‌లే.. వాట్ ఏ స్పీచ్..!


పూరీ జ‌గ‌న్నాథ్ ఈ మ‌ధ్య ఫామ్ లో లేడేమో కానీ అత‌డి మాట‌ల్లో ఆ చ‌మ‌త్కారం మాత్రం ఇంకా త‌గ్గ‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో పూరీ నుంచి స‌రైన సినిమా ప‌డ‌లేద‌నేది వాస్త‌వం. గ‌త ఏడేళ్ల‌లో బిజినెస్ మ్యాన్, టెంప‌ర్ మాత్ర‌మే ఆడాయి. అవి కూడా సూప‌ర్ హిట్లు కాదు. జ‌స్ట్ బ‌య‌ట‌ప‌డ్డాయంతే.
మ‌ళ్లీ చాలా ఏళ్ళ త‌ర్వాత కొడుకు సినిమాతో జోష్ గా క‌నిపిస్తున్నారు. మెహ‌బూబా సినిమా ప్రెస్ మీట్ లో వింటేజ్ పూరీని మ‌రోసారి పరిచ‌యం చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఆకాశ్ గురించి చెప్పిన మాట‌ల‌న్నీ న‌వ్వు తెప్పించాయి. మెహ‌బూబా హీరో ఆకాశ్ త‌నకు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుసని త‌న‌దైన శైలిలో న‌వ్వులు పూయించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక వాడు మా ఇంట్లోనే ఉండేవాడంటూ త‌న కుమారుడిపైనే స‌ర‌దా క‌మెంట్స్ చేసారు.
4 ఏళ్లు ఉన్న‌ప్ప‌ట్నుంచే ఒక్క వేశం అంటూ త‌న‌ను చంపేసేవాడ‌ని.. ఆ పోరు ప‌డ‌లేకే చిరుత‌లో వేశం ఇచ్చాన‌ని చెప్పాడు పూరీ. ఇక 8 ఏళ్లున్న‌పుడే మ‌హేశ్ బాబు కోసం క‌థ రాసుకున్నాడ‌ని.. అది మ‌హేశ్ కు చెప్పాలంటూ ఒక‌టే గోల చేసేవాడ‌ని చెప్పాడు పూరీ. ఇంత‌కీ ఆ క‌థ‌లో ఏముందో తెలుసా.. ప‌దేళ్ల కుర్రాడికి మ‌హేశ్ స్నేహితుడు.. ఈ కుర్రాన్ని చూడ‌కుండా మ‌హేశ్ ఉండ‌లేడు.. అలాంటి మ‌హేశ్ ను ఓ రోజు విల‌న్లు చంపేస్తారు..
ఆ ప‌గ‌ను కుర్రాడు ఎలా తీర్చుకున్నాడు అనేది అస‌లు క‌థ‌. ఇది కానీ మ‌హేశ్ కు చెబితే ఇద్ద‌ర్ని తంతాడ‌ని పూరీ జోకులు పేల్చాడు. క‌చ్చితంగా మెహ‌బూబా సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు కూడా పూరీ మంచి సినిమా చేసాడ‌ని చెప్తార‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి చూడాలిక‌.. కొడుకు సినిమాతోనైనా పూరీ బ్యాక్ అవుతాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here