ప్యాడ్ మ్యాన్ వ‌చ్చినా ప‌ద్మావ‌తి ఆగ‌ట్లేదుగా.. 

అంతేమ‌రి.. ప్రేక్ష‌కులు ఒక్క‌సారి క‌నెక్ట్ అయితే కొన్ని సినిమాల‌కు అలాగే ప‌ట్టం క‌ట్టేస్తుంటారు. ఇప్పుడు ప‌ద్మావతి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందేమో వ‌స్తే చంపేస్తాం అన్నారు. కానీ విడుద‌లైన త‌ర్వాత మాత్రం అబ్బో అద్భుతం అంటున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 470 కోట్లు దాటేసి.. 500 కోట్ల వైపుగా అడుగేస్తుంది ప‌ద్మావ‌త్. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత‌గా వ‌సూళ్లు రావ‌డం మాత్రం నిజంగా ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాల్ని కూడా ఆశ్చ‌ర్యంలో ముంచేస్తుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ మాయ‌కు తోడు దీపిక, ర‌ణ్వీర్ ల న‌ట‌న సినిమాను మ‌రోస్థాయికి చేర్చేసింది. ఇప్ప‌టికే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 240 కోట్ల మైలురాయి అందుకుని 250 కోట్ల వైపుగా వెళ్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ లెక్క 470 కోట్ల‌కు చేరింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రాణి ప‌ద్మావ‌త్ హ‌వా భారీగా ఉంది. ఈ చిత్రం ఇప్ప‌టికే అక్క‌డ 70 కోట్లు వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ లో 10 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. మ‌రికొన్ని రోజులు ఈ దూకుడు ఇలాగే సాగేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం ప్యాడ్ మ్యాన్ వ‌చ్చినా కూడా ప‌ద్మావ‌త్ వ‌సూళ్లు మాత్రం త‌గ్గ‌లేదు. మొత్తానికి చూడాలిక‌.. ఈ చిత్రం దూకుడు ఇంకెన్ని రోజులు కొన‌సాగ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here