ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం RX 100


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం   RX 100 ( An Incredible Love Story )   . కార్తికేయ, పాయల్ రాజపుట్  ఇందులో హీరోహీరోయిన్లు.  KCW  బ్యానర్ పై  అశోక్ రెడ్డి గుమ్మకొండ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   ఈ చిత్రం ప్రీలుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.   రావురమేష్, సింధూర పువ్వు రాంకీ ఇందులో కీలక  పాత్రలు పోషిస్తున్నారు. హైలీ ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పని చేస్తోంది . నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్. కే.ఎల్ ( ‘కబాలి’ ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  తెలుగులో ఆయనకు యిదే తొలి చిత్రం కావడం విశేషం . వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
నటీనటులు:
కార్తికేయ, పాయల్ రాజపుట్, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్.
సాంకేతిక  వర్గం:
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్,సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్,సురేష్ వర్మ, స్టంట్స్:  రియల్ సతీష్ ,  ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ),  సినిమాటోగ్రఫీ: రామ్ ,పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here