ప్రియుడి కోసం న‌య‌న్ భారీ స్కెచ్


పైకి పాల‌కోవాలా సుతిమెత్త‌గా క‌నిపిస్తుంది కానీ లోప‌ల మాత్రం చాలా విష‌యాలే దాచేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రిఫ‌రెన్సులు చేయ‌డం అంటే న‌య‌న తార‌కు పెద్ద‌గా న‌చ్చ‌దు. కానీ ఇప్పుడు చేయ‌క త‌ప్ప‌ట్లేదు. ఎందుకంటే ఆమెకు తోడుగా ప్రియుడు ఉన్నాడు. అత‌న్ని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త కూడా ఇప్పుడు న‌య‌న‌తారే తీసుకుంది. త‌న క్రేజ్ ను ప‌ణంగా పెట్టి ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ కెరీర్ కోసం త్యాగాలు మొద‌లుపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌.
నానుం రౌడీథాన్ తో స్టార్ డైరెక్ట‌ర్ అయిన విఘ్నేష్.. గ్యాంగ్ ఫ్లాప్ తో వెన‌క్కి వెళ్లిపోయాడు. దాంతో ఇప్పుడు విఘ్నేష్ కెరీర్ ను నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది ఈ భామ‌. ఇన్నాళ్లూ ద‌ర్శ‌కుడిగా ఉన్న త‌న ప్రియున్ని ఇప్పుడు హీరోను చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది.
దానికోసం త‌న ఇమేజ్ వాడేస్తుంది ఈ భామ‌. తాను సిద్ధం చేసుకున్న క‌థ‌లో హీరోయిన్ గా న‌టించ‌డానికి ఓకే అంటుంది కానీ ఆ సినిమాలో హీరోగా విఘ్నేష్ న‌టించాల‌ని చెబుతుంది న‌య‌న్. ఇదే విష‌యం నిర్మాత‌ల‌తో చెబుతుంది. అలా చేస్తే త‌ప్ప న‌టించ‌న‌ని తెగేసి చెబుతుంది న‌య‌న‌తార‌. ఎలాగూ న‌య‌న్ ఉంటుంది కాబ‌ట్టి నిర్మాత‌లు కూడా ముందుకొస్తున్నారు. గ‌తంలో ర‌ఘువ‌ర‌న్ బిటెక్ లో చిన్న పాత్ర‌లో న‌టించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు మ‌రి హీరోగా స‌క్సెస్ అవుతాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here