ప్రివ్యూ: నా నువ్వే

NAA NUVVE PREVIEW

నా నువ్వే.. సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలియ‌దు కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఈ చిత్రం గురించి మాత్రం బాగానే మాట్లాడుకుంటున్నారు. దానికి కార‌ణం క‌ళ్యాణ్ రామ్ మేకోవ‌ర్. సాధార‌ణంగా నంద‌మూరి హీరోల నుంచి ప్రేమ‌క‌థలు ఊహించ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే వాళ్ల చేతుల్లో క‌త్తులు గ‌న్నులు బాగుంటాయి కానీ పువ్వులు కాదు. అందుకే వాళ్లెప్పుడూ అటు వైపు అడుగేయ‌లేదు. కానీ కెరీర్ లో తొలిసారి క‌ళ్యాణ్ రామ్ ఆ సాహ‌సం చేసాడు. సింపుల్ గా క‌ళ్ల‌జోడు పెట్టుకుని.. నీట్ గా షేవ్ చేసుకుని..

ట‌క్ చేసుకుని ప‌క్కింటి అబ్బాయిగా మారిపోయాడు. నా నువ్వేలో ఏ పోస్ట‌ర్ చూసినా మ‌న‌కు కొత్త క‌ళ్యాణ్ క‌నిపిస్తున్నాడు. అస‌లు మ‌నం చూస్తున్న‌ది ఇన్నాళ్లూ చూసిన క‌ళ్యాణ్ రామ్ నేనా అనే డౌట్ కూడా మ‌న‌సులో వ‌చ్చేస్తుంది. అంత‌గా మారిపోయాడు ఈ చిత్రం కోసం. ల‌వ‌ర్ బాయ్ లా మారిపోయి త‌మ‌న్నాతో రొమాన్స్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక త‌మ‌న్నా కూడా అదిరిపోయింది ఈ చిత్రంలో. పైగా సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకోవ‌డంతో ఇంపాక్ట్ ఇంకా బ‌లంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ట్రైల‌ర్.. సాంగ్స్ అన్నీ క్లాస్ గా ఉన్నాయి.

కానీ అంచ‌నాలు అయితే భారీగా మాత్రం లేవు. సినిమా బాగుంద‌ని చెబితే కానీ థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కులు వ‌చ్చే ప‌రిస్థితి అయితే లేదు. దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డం.. ఈయ‌న తొలి సినిమా 180 డిజాస్ట‌ర్ కావ‌డం. దాంతో పాజిటివ్ టాక్ వ‌స్తేనే నా నువ్వే నిల‌బ‌డుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ నంద‌మూరి హీరో ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో.. జూన్ 14న విడుదల కానుంది ఈ చిత్రం. మ‌హేశ్ కోనేరు దీనికి నిర్మాత‌. యుఎస్ లోనూ భారీగానే విడుద‌ల కానుంది నా నువ్వే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here