ప్రివ్యూ: రాజుగాడు


ఇండ‌స్ట్రీలో జాత‌కం మారిపోవ‌డానికి టైమ్ పెద్ద‌గా ప‌ట్ట‌దు. హిట్లు రావాలంటే క‌ష్టం కానీ ఫ్లాపులు రావాలంటే ఎంత సేపు..? ఇప్పుడు రాజ్ త‌రుణ్ కు కూడా ఇదే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆయ‌న వ‌ర‌స‌గా మూడు హిట్లు కొట్టేస‌రికి మ‌రో ఉద‌య్ కిర‌ణ్ అవుతాడేమో అనుకున్నారు కానీ ఫ్లాప్ ఉద‌య్ కిర‌ణ్ అవుతాడు అనుకోలేదు. ఇప్పుడు ఈయ‌న‌కు కానీ హిట్ ప‌డ‌క‌పోతే మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. పైగా ఎలాంటి అండ కూడా లేదు క‌దా.. దాంతో రాజ్ త‌రుణ్ కు చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అదే ఇప్పుడు రాజుగాడు.. జూన్ 1న విడుద‌ల. పైగా ఆ రోజు నాగార్జున ఆఫీస‌ర్ తో పాటు అభిమ‌న్యుడు కూడా విడుదల అవుతున్నాయి. అయితే ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డం.. వ‌ర్మ ఇప్పుడు ఫామ్ లో లేక‌పోవ‌డం.. అభిమ‌న్యుడు డ‌బ్బింగ్ సినిమా కావ‌డం రాజుగాడికి క‌లిసొచ్చే అంశం. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న హిట్ కోరిక తీరుస్తుంద‌నే న‌మ్ముతున్నాడు రాజ్ తరుణ్. ఇది కానీ హిట్టైతే మ‌ళ్లీ ఈ కుర్రాడి ద‌శ మారిన‌ట్లే. ఎందుకంటే త‌ర్వాత సినిమా దిల్ రాజు బ్యాన‌ర్ లో ఉంది. ల‌వర్ అంటూ అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. మ‌రి చూడాలిక‌.. రాజుగాడుతో గాడిన ప‌డి.. ల‌వ‌ర్ తో మళ్లీ ట్రాక్ ఎక్కుతాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here