ప్రేయ‌సి కావాలంటున్న నాగ‌చైత‌న్య‌..


మొన్నే క‌దా పెళ్లైంది.. ఇంట్లో ఇల్లాలు ఉండ‌గా ఇప్పుడు ప్రియురాలు ఎందుకు అనుకుంటున్నారా..? ఇప్పుడు నాగ‌చైత‌న్య చాలా మారిపోయాడు. ఒక‌ప్పుడు రొటీన్ క‌థ‌ల‌తో ఫ్లాపులు కొని తెచ్చుకున్న చైతూ.. ఇప్పుడు చాలా కొత్త‌గా ఆలోచిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న మూడు సినిమాల‌కు క‌మిట‌య్యాడు. మూడు డిఫెరెంట్ జోన‌ర్స్. ఒక‌దాంతో మ‌రో దానికి సంబంధం ఉండ‌దు. చందూమొండేటితో చేస్తోన్న స‌వ్య‌సాచిలో కొత్త పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు చైతూ. ఇందులో హీరో ఎడ‌మ‌చేతికి బాడీతో క‌నెక్ష‌న్ ఉండ‌దు. ఇది క‌చ్చితంగా తెలుగు ఇండ‌స్ట్రీలో ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని భావిస్తున్నాడు చందూ. ఇక మారుతితో క‌మిటైన సినిమా ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్. అప్ప‌ట్లో అల్ల‌రి అల్లుడు త‌ర‌హాలో సాగే సినిమా ఇది. దీనికి శైలజా రెడ్డి అల్లుడు టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ర‌మ్య‌కృష్ణ శైలజారెడ్డిగా న‌టించ‌బోతుంది. ఇక ఇప్పుడు మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు నాగ‌చైత‌న్య‌. అదే శివ నిర్వాణ‌తో సినిమా. ఇది పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రం. దీనికి ప్రేయ‌సి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే ఇల్లాలే ప్రియురాలు అవుతుండ‌టం. అవును.. శివ నిర్వాన సినిమాలో హీరోయిన్ గా స‌మంత‌నే తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మారుతి సినిమాతో పాటే ఈ చిత్రాన్ని కూడా ఒకేసారి ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు నాగ‌చైత‌న్య‌. మొత్తానికి మూడు డిఫెరెంట్ సినిమాలు.. మూడు భిన్న‌మైన క‌థ‌ల‌తో అడుగు ముందుకేస్తున్నాడు అక్కినేని వార‌సుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here