ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కోడిరామ‌కృష్ణ లాంచ్ చేసిన `అంగుళీక‌` టీజ‌ర్‌!!

 ప్రియ‌మ‌ణి టైటిల్ పాత్ర‌లో శ్రీ శంఖు చ‌క్ర ఫిలింస్ ప‌తాకంపై కోటి తూముల, ఎ.హితేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అంగుళీక‌`.  ప్రేమ్ ఆర్య‌న్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. దీప‌క్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్ర టీజ‌ర్ లాంచ్  ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ చేతుల మీదుగా ఆదివారం హైదారాబాద్ లో  జ‌రిగింది. టీజ‌ర్ లాంచ్  చేసిన అనంత‌రం కోడిరామ‌కృష్ణ‌మాట్లాడుతూ…
“ఈ సినిమా గురించి, క‌థ గురించి నాకు మొద‌టి నుంచి తెలుసు. నిర్మాత‌లు ఎప్ప‌క‌ప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు.  టీజ‌ర్ చాలా బాగుంది. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా అన్నింటినీ త‌ట్టుకుంటూ నిర్మాత‌లు ఇంత వ‌ర‌కూ తీసుకొచ్చారు. డైర‌క్ట‌ర్ కు అండ‌గా నిల‌బ‌డ్డారు. టీజ‌ర్ టైమింగ్‌, క‌టింగ్  చూశాక ద‌ర్శ‌కుడు సినిమా అద్భుతంగా తీసుండాని అర్ధ‌మైంది. నిర్మాతలిద్ద‌రూ నాకు కావాల్సిన వారు.  సినిమా ప‌ట్ల ఎంతో పాష‌న్ ఉన్న‌వారు. ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం అవుతున్న  నిర్మాత‌ల‌కు మంచి లాభాలు, ద‌ర్శ‌కుడికి మంచి పేరు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
 నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ…“సూర్య‌గ్ర‌హ‌ణం, కాల‌చ‌క్రంతో కూడుకున్న క‌థాంశం ఇది. ద‌ర్శ‌కుడు చాలా కాలం ఈ స్ర్కిప్ట్ పై వ‌ర్క్ చేసి అద్భుతంగా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుగుతోంది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వ‌చ్చింది. కోడి రామ‌కృష్ణ‌గారి చేతుల మీదుగా టీజ‌ర్ లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.
మ‌రో నిర్మాత ఎ.హితేష్ రెడ్డి మాట్లాడుతూ…“క‌థ న‌చ్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. విజువ‌ల్స్ చాలా గ్రాండియ‌ర్ గా ఉంటాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్రంగా  భారీ బ‌డ్జెట్ తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు ప్రేమ్ ఆర్య‌న్ మాట్లాడుతూ…“కోడి రామ‌కృష్ణ‌గారి ఇనిస్పిరేష‌న్‌తో ఈ చిత్రాన్ని డైర‌క్ట్ చేశాను. వారి చేతుల మీదుగా కాన్సెప్ట్ టీజ‌ర్ లాంచ్ జ‌ర‌గ‌డం హ్యాపీగా ఉంది. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా మా నిర్మాత అన్నింటినీ అధిగ‌మిస్తూ సినిమాను అనుకున్న విధంగా తెర‌కెక్కించ‌డానికి స‌హ‌క‌రించారు. .కాల చ‌క్రంతో ముడిప‌డిన ఇద్ద‌రు ప్రేమికుల వీర‌గాథ ఈ చిత్రం. అంగుళీక‌గా టైటిల్ పాత్ర‌లో ప్రియ‌మ‌ణి గారు అద్భ‌తంగా న‌టించారు. కాల‌చ‌క్రం, సూర్య‌గ్ర‌హ‌ణం ఈ రెండు అంశాల చుట్టూ  సినిమా తిరుగుతుంది. సూర్య‌గ్ర‌హ‌ణం ఘ‌డియ‌ల్లో విడిపోయిన ప్రేమ‌జంట మ‌ళ్లీ సూర్యూడి ఆశీస్సుల‌తో 585 ఏళ్ల త‌ర్వాత క‌లుసుకుంటారు. అదే స‌మ‌యంలో  ప‌గ‌తో ర‌గిలిపోతున్న  దుష్టాత్మ ఆ జంట‌పై ప‌గ తీర్చుకుందా? ఆ ప్రేమ జంట ఆత్మ‌ల‌కు ఎలా మోక్షం క‌లిగింది అనేది సినిమాకు హైలెట్ గా ఉంటుంది“ అన్నారు.
దేవ్ గిల్, వివ్య‌, శేఖ‌ర్ వ‌ర్మ‌, పంక‌జ్‌, మేకా రామ‌కృష్ణ‌, కోటేశ్వ‌రరావు, వేణు, అవినాష్‌, జ‌య‌వాణి తదిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః శామ్ కె ప్ర‌స‌న్‌;  కెమెరాః చిట్టిబాబు; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ః శ‌శి బాణాల‌, శివ సిర్రి; ఎడిటింగ్ః మార్తాండ్ కె వెంక‌టేష్ ;  మాట‌లుః సుద‌ర్శ‌న్‌;

నిర్మాత‌లుః కోటి తూముల‌, ఎ.హితేష్ రెడ్డి; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః ప్రేమ్ ఆర్య‌న్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here