ప్ర‌మోష‌న్స్ కోసం ఛ‌లో ఛ‌లో..

Chalo Trailer
ఈ రోజుల్లో సినిమాలు చేయ‌డం కంటే.. వాటిని ప్ర‌మోట్ చేసుకోవ‌డం కూడా తెలియాలి. ఒక్కోసారి ప్ర‌మోష‌న్ తోనే సినిమాల జాత‌కాలు కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు నాగ‌శౌర్య ఇదే చేస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తోన్న ఛ‌లో ప్ర‌మోష‌న్ వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ గ‌తేడాదే పూర్త‌యింది. డిసెంబ‌ర్ 29నే రావాల్సిన సినిమా.. అప్పుడు పోటీ కార‌ణంగా ఫిబ్ర‌వ‌రికి పోస్ట్ పోన్ అయింది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్ లో వేగం పెంచేసాడు శౌర్య‌. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని తెస్తున్నాడు. ట్రైల‌ర్ ను జ‌న‌వ‌రి 18న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ చిత్రం గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోని టైమ్ లో చూసి చూడంగానే పాట విడుద‌ల అయింది. ఆ త‌ర్వాత టీజ‌ర్ వ‌చ్చింది.. ఈ మ‌ధ్యే మ‌రో పాట విడుద‌లైంది. ఇవ‌న్నీ ఛ‌లో సినిమాపై ఎక్క‌డ‌లేని ఆస‌క్తి పెంచేస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా కెమెరావ‌ర్క్ అంద‌ర్నీ మాయ చేస్తుంది. సాయి శ్రీ‌రామ్ వ‌ర్క్ న‌చ్చి వెంట‌నే ద‌ర్శ‌కుడిగా కూడా ఆఫ‌ర్ ఇచ్చాడు నాగ‌శౌర్య‌. ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌త్ సంగీతం అందించాడు. ఇప్ప‌టి వర‌కు విడుద‌లైన రెండు పాట‌లు.. టీజ‌ర్ కు రెస్పాన్స్ బాగుంది. సినిమా ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల కానుంది. మ‌రి సినిమాకు కూడా ఇదే స్థాయిలో రెస్పాన్స్ వ‌స్తుందేమో చూడాలి. అన్న‌ట్లు ఈ చిత్రాన్ని నాగ‌శౌర్యే స్వ‌యంగా నిర్మిస్తున్నాడు కూడా. కాక‌పోతే వాళ్ల అమ్మ పేరు ఉష నిర్మాత‌గా ప‌డుతుంది పోస్ట‌ర్ లో. మ‌రి చూడాలిక‌.. ఈ కుర్ర హీరో ఆశ‌లు ఛ‌లో సినిమాతోనైనా నెర‌వేరుతాయేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here